
బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ
గుడ్లూరు: వైఎస్సార్ సీపీలో పనిచేసిన కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని బసిరెడ్డిపాలెం పంచాయతీ చెంచిరెడ్డి పాలేనికి చెందిన నరాల శ్రీనివాసులరెడ్డి పార్టీలో రైతు విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో పార్టీ శ్రేణులు బుర్రా దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే బుర్రా మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి శ్రీనివాసులరెడ్డి విషయం చెప్పారు. వెంటనే జగన్ బాధిత కుటుంబానికి రూ.1 లక్ష అందించాలని బుర్రాను ఆదేశించారు. మరో రూ.1 లక్షను కలిపి మొత్తం రూ.2 లక్షలను శ్రీనివాసుల రెడ్డి కుటుంబానికి బుర్రా అందించారు. దీంతో కుటుంబ సభ్యులు మాజీ సీఎం జగన్‌కు, బుర్రాకు కృతజ్ఞతలు తెలిపారు.