
144 గోవా మద్యం బాటిళ్లు స్వాధీనం
సింగరాయకొండ: అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఎం శివకుమారి తెలిపారు. నిందితుల నుంచి సుమారు రూ.2.13 లక్షల విలువైన 144 మద్యం బాటిళ్లు, రెండు మోటారుసైకిళ్లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటన గురువారం మండలంలోని పాకల పంచాయతీ పోతయ్యగారి పట్టపుపాలెం సమీపంలో బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే..చినగంజాం మండలం కోడూరివారిపాలెం గ్రామానికి చెందిన ప్రళయకావేరి జయంతిబాబు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం శ్రీరాంనగర్‌కు చెందిన జాన నాగార్జున, ఊళ్లపాలెం గ్రామానికి చెందిన అరవ పవన్‌లను అదుపులోకి తీసుకున్నామని, వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు వివరించారు. గోవా మద్యానికి, రాష్ట్రంలో అమ్మే మద్యానికి రూ.60 నుంచి రూ.120 వరకు వ్యత్యాసం ఉందని, దీంతో గోవా తయారీ మద్యం తీసుకుని వచ్చి అమ్ముతున్నారని, ఆ విధంగా అమ్మడం చట్టరీత్యా నేరమని తెలిపారు.