సిఫార్సు బదిలీ.. వీఏఏలు బలి! | - | Sakshi
Sakshi News home page

సిఫార్సు బదిలీ.. వీఏఏలు బలి!

Jul 16 2025 3:55 AM | Updated on Jul 16 2025 3:55 AM

సిఫార

సిఫార్సు బదిలీ.. వీఏఏలు బలి!

విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల బదిలీల్లో మితిమీరిన రాజకీయ జోక్యం

గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను భ్రష్టుపట్టించేందుకు కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే

సచివాలయ సేవలను సగానికి కుదించి, సర్వేల పేరుతో చెడుగుడు ఆడుకున్న సర్కారు.. తాజాగా బదిలీల మాటున ఏకంగా బంతాట ఆడుతోంది.

జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల నియోజకవర్గ ఇన్‌చార్జుల సిఫార్సు లేఖలను ప్రామాణికంగా తీసుకుని అడ్డగోలుగా బదిలీలు

చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాక్షి నెట్‌వర్క్‌:

చివాలయ ఉద్యోగులుగా ఎంపికై న వారు సొంత మండలంలోనే, సమీప గ్రామాల్లోనే విధులు నిర్వహించేలా అవకాశం కల్పిస్తామని ఆ వ్యవస్థ ప్రారంభ సమయంలోనే అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే నియామక ప్రక్రియ సాగింది. కానీ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత సచివాలయ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడే నిర్ణయాలను వరుసగా తెరమీదకు తెస్తోంది. ఇటీవల మొదలైన బదిలీల ప్రక్రియ తమను మానసికంగా కుంగదీస్తోందని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బదిలీల్లో దివ్యాంగులకు వెసులుబాటు కల్పించాలన్న నిబంధనలను రాజకీయ జోక్యంతో అధికారులు తుంగలో తొక్కారు. గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట మండలంలోని సలకలవీడులో పనిచేస్తున్న దివ్యాంగుడు టి.రమణారెడ్డికి మొదటి జాబితాలో కందులాపురం–2 పోస్టింగ్‌ ఇచ్చారు. రెండో జాబితాలో త్రిపురాంతకం మండలం విశ్వనాథపురం బదిలీ చేశారు. బేస్తవారిపేట మండలంలోని పిటికాయగుళ్లలో పనిచేస్తున్న కొండారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే సిఫార్సుతో కందులాపురం–2కు చేరాడు.

● కంభం మండలం కందులూపురం–1లో పనిచేస్తున్న దివ్యాంగుడు బి.వెంకట రమేష్‌ను మొదట మార్కాపురం మండలం చింతకుంట బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రెండో జాబితాలో మాత్రం ఆయన పేరు చీమకుర్తి మండలం దేవరపాలేనికి మారింది.

● కంభం మండలంలోని చిన్నకంభం సచివాలయంలో పనిచేస్తున్న బి.ప్రగతిని మొదటి లిస్టులో హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లెకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నట్లు పేర్కొని, రెండో లిస్ట్‌లో ఏకంగా బాపట్ల జిల్లా సంతమాగులూరు వేశారు.

● గిద్దలూరు మండలంలోని కొమ్మునూరు సచివాలయంలో పనిచేస్తున్న చేరెడ్డి సుస్మితను శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా కందుకూరుకు బదిలీ చేశారు. 9 నెలల బాబుతో వేరే జిల్లాకు వెళ్లి ఎలా పనిచేయాలని ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతోంది.

త్రిపురాంతకం మండలంలోని రాజుపాలెం రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కె.వెంకట ధనుశ్రీ బదిలీల కౌన్సెలింగ్‌లో యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ఉన్న మూడు సచివాలయాలను కోరుకుంది. అయితే ఆమె కోరుకున్న గ్రామాలు కాకుండా యర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలేనికి బదిలీ చేస్తున్నట్లు ఈ నెల 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు కూడా సిద్ధపడిన ఆమెను వెంకటాద్రిపాలెంలో జాయిన్‌ చేసుకోలేదు. ఈ నెల 5వ తేదీన మరో జాబితాను పాత తేదీ(జూన్‌ 21)తో విడుదల చేశారు. రెండో జాబితాలో ఏకంగా ఆమెను మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లి సచివాలయానికి బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో మనోవేదనకు గురైన ఆమె గత సోమవారం ఒంగోలు కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు వెళ్లి అర్జీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలో 17 చోట్ల ఉందని, ఆయా ప్రాంతాలకు చెందిన నాయకుల సిఫార్సు లెటర్లు లేకపోవడం వలన కౌన్సెలింగ్‌ ప్రకారం కాకుండా ఖాళీ ఉన్న సచివాలయాలకు బదిలీ చేయాల్సి వచ్చిందని ఒక అధికారి చెప్పడం గమనార్హం. యర్రగొండపాలెం నియోజకవర్గంలో మొత్తం 88 సచివాలయాలు ఉండగా అనేక మంది కూటమి నేత సిఫార్సు లెటర్‌తో అనుకూలమైన చోట పోస్టింగ్‌ దక్కించుకున్నారు.

దర్శి నియోజవకర్గంలో సచివాలయాల ఉద్యోగులు కొందరికి రాజకీయాలు ఆపాదించి బదిలీల పేరుతో వేధింపులకు తెరతీయడం చర్చనీయాంశమైంది. సిఫార్సు లేఖలు తెచ్చుకోనివారిలో కొందరిని బాపట్ల జిల్లాకు, మరికొందరిని యర్రగొండపాలెం మండలానికి బదిలీ చేయడం గమనార్హం. స్థానిక టీడీపీ నేతలు సిఫార్సు లేఖల పేరుతో చేతివాటం చూపినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముండ్లమూరు మండలంలో నియోజకవర్గ టీడీపీ నేత పేరు చెప్పి ఉద్యోగుల నుంచి రూ.15 వేలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.

టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జుల రికమెండేషన్‌ ఉంటే కోరుకున్న చోట పోస్టింగ్‌

సిఫార్సు లెటర్‌ లేదనే సాకుతో పక్క జిల్లాలకు గెంటేసిన వైనం

బదిలీల్లో కిరికిరి.. సిఫార్సులతో రెండుసార్లు జాబితాలు విడుదల

గ్రీవెన్స్‌, హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైన ఉద్యోగులు

ఉద్యోగులకు

బదిలీల్లో అన్యాయం చేశారు సార్‌..

దివ్యాంగులు, బాలింతలపైనా

సిఫార్సు బదిలీ.. వీఏఏలు బలి! 1
1/1

సిఫార్సు బదిలీ.. వీఏఏలు బలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement