
షాపులకు సీళ్లు
కూరగాయల మార్కెట్‌లో
ఒంగోలు సబర్బన్: కొత్త కూరగాయల మార్కెట్ దుకాణదారులపై వేధింపులు ఆగటం లేదు. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులు మార్కెట్‌పై దాడులు చేయటం పనిగా పెట్టుకున్నారు. సోమవారం పోలీసులను తీసుకొని కూరగాయల మార్కెట్‌లోని హోల్‌సేల్, రిటైల్ షాపులపై దాడులకు దిగారు. అద్దె బకాయిల పేరుతో నిత్యం వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం హోల్‌సేల్ షాపుల్లో 8 షాపులకు సీళ్లు వేశారు. అప్పటికప్పుడు రూ.లక్ష చొప్పున కట్టిన మూడు షాపులకు సీళ్లు తొలగించారు. రిటైల్ షాపులకు 15కు పైగా వేశారు. ఈ విధంగా మార్కెట్‌ని షాపులపై దాడులు చేయటంతో వ్యాపారులు బెంబేలెత్తారు. పాలకులు, అధికారులు చేసిన పాపానికి కూరగాయల మార్కెట్‌లోని షాపుల లీజుదారులు అల్లాడిపోతున్నారు.
రిటైల్, హోల్‌సేల్ కలిపి దాదాపు 23 షాపులకు సీల్ మూడు షాపులకు ఒక్కొక్కరు రూ.లక్ష కడితే సీళ్లు తెరచిన అధికారులు

షాపులకు సీళ్లు