
గ్రానైట్ రాయి కింద పడి కూలీ మృతి
పొదిలి రూరల్: గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తుండగా రాయి జారి మీద పడటంతో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పొదిలి మండలంలోని ఏలూరు పంచాయతీ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఏలూరు పరిధిలోని వర్ణ గ్రానైట్ ఫ్యాక్టరీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుడమా కుష్వాహా(33) గత కొంత కాలం నుంచి పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే కటింగ్ మెషీన్‌తో భారీ గ్రానైట్ రాయిని కోసేందుకు సిద్ధం చేస్తున్న సమయంలో జారిపడింది. రాయి మీద పడటంతో కుష్వాహా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తోటి కార్మికులు గమనించి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గ్రానైట్ రాయి కింద పడి కూలీ మృతి