పాలన ఎరుపెక్కి!
ప్రశ్నించే గొంతునొక్కి..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చి కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద అడ్డగోలుగా కేసులు పెట్టి వేధించడం మొదలు పెట్టింది. ఎప్పుడో సోషల్‌మీడియాలో చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద కూడా కేసులు పెట్టింది. యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై ఏకంగా ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు ఇన్‌చార్జ్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి మీద కూడా కేసులు పెట్టించింది. భయానక వాతావరణాన్ని సృష్టించి రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడకుండా చేసింది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేయించి భీతావహ వాతావరణాన్ని సృష్టించింది.
ఏడాది పాలన


