
కూలిన వందేళ్ల భారీ వృక్షం
టంగుటూరులో కూలిన భారీ వృక్షం
టంగుటూరు: రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 100 సంవత్సరాల నాటి భారీ వృక్షం కూలిన సంఘటన టంగుటూరు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్షానికి నాని నాని వృక్షం ఒక్కసారిగా మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వాలింది. ఆ రోడ్డు మార్గాన నిత్యం ఆర్టీసీ బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు వందలాదిగా రాకపోకలు సాగిస్తుంటాయి. వృక్షం వాలిన సమయం మధ్యాహ్నం కావటంతో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు వాహనాలను దారిమల్లించారు. పంచాయతీ అధికారులు, పోలీసులు వాలిన భారీ వృక్షాన్ని తొలగించడంతో రాకపోకలు ఎప్పటిలాగే సాగాయి.