కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం

May 1 2025 1:08 AM | Updated on May 1 2025 1:08 AM

కూటమి

కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం

మద్దిపాడు: కూటమి ప్రభుత్వం కళ్లు మూసుకుపోయి రైతులను పట్టించుకోకుండా గాలికి వదిలేసిందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామంలోని పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్ల తీరును బుధవారం పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయనతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పొగాకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోలు చేయించి మార్కెట్‌ను నిలబెట్టారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వాపోయారు. ఈ సంవత్సరం పొగాకు సరిగా పండలేదని, పంట ఖర్చులు విపరీతంగా పెరిగి పోయాయని తెలిపారు. కూలీ, బ్యారన్‌ల అద్దెలు పెంచేశారని, దీని వలన రైతులకు ఖర్చు పెరిగిందన్నారు. కోల్డ్‌ స్టోరేజిల్లో ఉంచిన పొగాకు రంగు మారిపోతుందని, వేలం కేంద్రాల్లో పొగాకును కంపెనీల బయ్యర్లు కొనుగోలు చేయడం లేదన్నారు. దీంతో పాటు అన్ని కంపెనీల వారు ఫ్లోర్‌లో కొనుగోలుకు రావడం లేదని తెలిపారు. వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన పొగాకు బేళ్లను నోబిడ్‌ చేయడం వలన రైతు ప్రత్యక్షంగా నష్టపోతున్నారని వివరించారు.

అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పొగాకు, వరి, మిర్చి, శనగ పంటలు వేసిన రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతుల పక్షాన నిలిచిందన్నారు. గత సంవత్సరం కేజీ పొగాకు రూ.360 ఉంటే ఈ ఏడాది కేవలం రూ.250కు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఒక ఎకరా పంటకు సుమారు రూ.2.50 నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చులు అవుతాయని, కౌలుకు తీసుకున్న రైతుకై తే మరో రూ.50 వేలు అదనంగా అవుతాయన్నారు. ఈ ఏడాది అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిందని, నాణ్యత కూడా లేదన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు రైతుల పక్షాన నిలిచి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి వారికి గిట్టుబాటు ధర కల్పించారన్నారు. అన్నిరకాల పంటలకు మద్దతు ధర ఇవ్వడానికి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. వైఎస్సార్‌ ఫసల్‌ బీమా పథకం ద్వారా బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించిందని, పంట నష్టపోయిన రైతులకు వారి ఖాతాల్లో పంట నష్టపరిహారం అందించారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రీమియం కట్టకుండా వదిలేసిందని, రైతులే ప్రీమియం కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల సమస్యలపై వైఎస్‌ జగన్‌తో చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే వచ్చే 15 రోజుల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున పోరాటం ఉధృతం చేస్తామన్నారు. 2014–19 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో పలువురు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అప్పుడు కూడా ప్రతి పక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పొగాకు రైతుల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి ఆత్మహత్య చేసుకున్న పొగాకు రైతుల కుటుంబాలను కేంద్ర మంత్రులు వచ్చి పరామర్శించి వారికి నష్ట పరిహారం ఇప్పించేందుకు కృషిచేశామని ఆయన గుర్తు చేశారు.

పొగాకు, మిర్చి, వరి పంటలు వేసిన రైతుల దుస్థితి వర్ణనాతీతం పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తోంది రైతులకు వైఎస్సార్‌ సీపీ అండగా నిలుస్తుంది రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ధర గిట్టుబాటు కావడంలేదంటూ మొరపెట్టుకున్న పొగాకు రైతులు

సింహాచలంలో భక్తుల మృతిపై సంతాపం

సింహాచలంలో గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడంపై వైవీ సుబ్బారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతిలో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారని, ఇప్పుడు సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతి చెందారన్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే కార్యక్రమాల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ఆదిమూలపు సురేష్‌, గిద్దలూరు పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్‌, ఒంగోలు పార్లమెంట్‌ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర ఎస్‌సీ సెల్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కొమ్మూరి కనకారావు, వైఎస్‌ఆర్‌సీసీ రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ కార్యదర్శి పేరాల చెన్నకేశవులు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్‌ఆర్‌సీపీ సంతనూతలపాడు అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, నాగులుప్పలపాడు అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, చీమకుర్తి పట్టణ అధ్యక్షుడు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, మన్నం శ్రీధర్‌, గంటా ఆంజనేయరెడ్డి, డాకా పిచ్చిరెడ్డి, మద్దిపాడు మండల ఉపాధ్యక్షులు వాకా కోటిరెడ్డి, మండవ బాల చంద్రమౌళి, నాగులుప్పలపాడు మండల సీనియర్‌ నాయకుడు నలమలపు కృష్ణారెడ్డి, తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి, సంతనూతలపాడు జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఇనగంటి పిచ్చిరెడ్డి, రైతు సంఘం నాయకులు పల్లకి సత్యన్నారాయణరెడ్డి, మహానందరెడ్డి, జిల్లా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బెజవాడ రాము, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు నారా సుబ్బారెడ్డి, పోలినేని కోటేశ్వరరావు, పీ సంధ్య, రజనీకుమారి, సన్నపురెడ్డి రమణమ్మ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం1
1/1

కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement