యర్రగొండపాలెం: నియోజకవర్గంలో ఎటువంటి అధికారంలేని కూటమి నాయకుడికి అధికారులు వత్తాసు పలుకు తున్నారు. కీలకమైన పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారుల నుంచి ఇతర శాఖలకు చెందిన వారందరూ ఆయన ఆదేశాలు పాటించాల్సిందే. ప్రజలతో ఎన్నికై న ఎమ్మెల్యేను కాదని ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ నాయకుడి ఇంటి చుట్టూ అధికారులు తిరుగుతున్నారంటే రాష్ట్రంలో కూటమి పాలన ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. మంగళవారం కూటమి నాయకుడు మార్కాపురంలో ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో హౌసింగ్ అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహం మంజూరు చేయాలని, అనర్హులపై చర్యలు తీసుకోవాలని ఆ నాయకుడు హుకుం జారీ చేశాడు. నియోజకవర్గంలో కనీసం ఓటు కూడా లేని వ్యక్తి ప్రభుత్వ ప్రతినిధిగా ఏ విధంగా చలామణి అవుతున్నాడని, మాకు నాయకత్వం వహించే హక్కు మీకు లేదని ఎన్నికల్లో ఓటర్లు తీర్పు చెప్పినప్పటికీ పెత్తనం చేయడం ఆయనకే చెల్లిందని ఈ ప్రాంతం ప్రజలు విమర్శిస్తున్నారు. హౌసింగ్ సమీక్ష సమావేశంలో ఆ శాఖ డీఈఈ ఎస్.వి.సురేష్ బాబు, ఏఈలు అంజిరెడ్డి, జాన్‌సుందర్, శ్రావ్య, శివశంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రజలతో ఎన్నికై న ఎమ్మెల్యేను కాదని పచ్చనేత చెప్పిందే వేదం అధికారులతో సమీక్షలు, ఆదేశాలిస్తున్న టీడీపీ ఇన్‌చార్జ్
కూటమి నేతకు అధికారుల జీ హుజూర్