
జిల్లా జూనియర్ బాల, బాలికల హాకీ జట్ల ఎంపిక
సంతనూతలపాడు: రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జూనియర్ హాకీ బాల, బాలికల జట్ల ఎంపిక శనివారం సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారితో జిల్లా జట్లను ఎంపిక చేశారు. సంతనూతలపాడు ఎస్సై అజయ్ బాబు, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు డీవీఎల్.నరసింహారావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుందరరామిరెడ్డి, పీడీ కే.వనజ, హాకీ అసోసియేషన్ సభ్యులు టి.రవికుమార్, పి.రవి, మాధవరావు, విద్యా కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, డైట్ సీనియర్ లెక్చరర్ ఆర్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.