● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
కనిగిరిరూరల్: ఆటో బోల్తా పడి మహిళా కూలీ మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం పట్టణంలోని కాశిరెడ్డి కాలనీకి చెందిన కూలీలు ఆటోలో పీసీపల్లి మండలం తలకొండపాడుకు ఆటోలో వెళ్తున్నారు. మార్గం మధ్యలో మండలంలోని విజయగోపాలపురం మలుపు వద్ద చిల్లచెట్లు అడ్డు రావడంతో వాటిని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇండ్లా లక్ష్మమ్మ (50) కిందపడటంతో తలకు బలమైన గాయమై.. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. రావూరి సంజమ్మ, వరమ్మలకు తీవ్ర గాయాలు కావడంతో కనిగిరి వైద్యశాలకు తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా నలుగురు కూలీలకు స్వల్పగాయాలయ్యాయి. ఈమేరకు ఎస్సై టీ శ్రీరాం సంఘటనా స్థలానికి వెళ్లి సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.