అంత్యక్రియలకు అడ్డొచ్చిన పేదరికం! | - | Sakshi
Sakshi News home page

అంత్యక్రియలకు అడ్డొచ్చిన పేదరికం!

Published Fri, Mar 21 2025 1:38 AM | Last Updated on Fri, Mar 21 2025 1:34 AM

గిద్దలూరు రూరల్‌: ఆ కుటుంబానికి పేదరికం శాపంగా మారింది. ఇంటి యజమాని చనిపోతే అంత్యక్రియలు చేయలేని స్థితిలో వారిని నిలబెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరు పట్టణంలోని ఏబీఎం పాలెంలో నివాసం ఉంటున్న పానుగంటి దానియేలు(48)కు కాలేయ సంబంధిత వ్యాధితో గురువారం మృతి చెందాడు. వృత్తిరీత్యా పెయింటింగ్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే దానియేలు మృతి చెందడంతో భార్య సౌదమ్మ దీనంగా రోదిస్తోంది. భర్త అంత్యక్రియలు నిర్వహించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇంటి వద్ద భర్త శవాన్ని పెట్టుకుని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. కుమారుడు, కుమార్తె చిన్న పిల్లలు కావడం, భర్త అర్ధంతరంగా మృతి చెందడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు దాతలు సాయం చేయాలని వేడుకుంటోంది.

‘గేట్‌’లో అంకిరెడ్డిపల్లె విద్యార్థికి

ఆలిండియా 272వ ర్యాంకు

గిద్దలూరు రూరల్‌: గేట్‌(గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌)లో మండలంలోని అంకిరెడ్డిపల్లెకు చెందిన షేక్‌.మహమ్మద్‌ జాతీయ స్థాయిలో 272వ ర్యాంక్‌ సాధించాడు. గుంటూరు ఏఎన్‌యూలో 90 శాతం మార్కులతో బీటెక్‌ పూర్తి చేసిన మహమ్మద్‌ ఫిబ్రవరి 2న హైదరాబాద్‌లో ‘గేట్‌’ రాయగా గురువారం ఫలితాలు వెల్లడయ్యాయి. మహమ్మద్‌తోపాటు అతడి తండ్రి షేక్‌ పీరావలిని గ్రామస్తులు అభినందించారు.

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

సింగరాయకొండ: పాకల బీచ్‌లో బుధవారం గల్లంతైన చాట్రగడ్డ సిసింద్రీ(27) మృతదేహం కొత్తపట్నం మండలం మడనూరు సముద్ర తీరంలో లభ్యమైనట్లు ఎస్సై బి.మహేంద్ర తెలిపారు. సిసింద్రీ టంగుటూరు మండలం ఎం.నిడమానూరు ఎస్సీ కాలనీలో నివసిస్తుంటాడు. తన బంధువులైన యువకులతో కలిసి బుధవారం పాకలలో సముద్ర స్నానానికి వచ్చి గల్లంతైన విషయం తెలిసిందే. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

అంత్యక్రియలకు అడ్డొచ్చిన పేదరికం! 1
1/2

అంత్యక్రియలకు అడ్డొచ్చిన పేదరికం!

అంత్యక్రియలకు అడ్డొచ్చిన పేదరికం! 2
2/2

అంత్యక్రియలకు అడ్డొచ్చిన పేదరికం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement