
హంస వాహనంపై దేవదేవుడు
కొనకనమిట్ల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెలుగొండ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. మంగళవారం శ్రీవారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పల్లకిపై శ్రీవారి ఉత్సవమూర్తిని నరసింహుని అవతారంలో అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య వెలుగొండ వీధుల్లో ఊరేగించారు. అడుగడుగునా భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించి, పల్లకి మోసి తమ భక్తిని చాటుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఈదుల చెన్నకేశవరెడ్డి్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కుందురు కాశిరెడ్డి, ఉభయదాతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేదపండితులు ప్రసాదాచార్యులు, భార్గవాచార్యులు, సింహాద్రీచార్యులు ఉభయదాతలతో కలిసి స్వామివారికి అర్చనలు అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి, అన్న సంతర్పణ చేశారు. బుధవారం శ్రీవారు శేషవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

హంస వాహనంపై దేవదేవుడు