
శనగ సాగు అంటేనే భయంగా ఉంది
ఈ ఏడాది శనగ పంట అదును సమయంలో తీవ్రమైన వర్షాలతో పంట కాలం కొంత లేటైనప్పటికీ గతేడాది ఉన్న మార్కెట్ ఆశతో ఈ ఏడాది కూడా 10 ఎకరాల వరకు శనగ పంట సాగు చేశా. అయితే, గతేడాది పంట చేతికొచ్చే సమయానికి కాక్–2 రకం శనగలకు సుమారు 10 వేల రూపాయల వరకు రేటు ఉంటే.. ఈ ఏడాది ఇదే రకం శనగకు కేవలం కేవలం రూ.6,800 మాత్రమే ఉంది. జేజే శనగలకు ప్రస్తుతం రూ.5 వేల కంటే ఎక్కువ అడిగే పరిస్థితి కనిపించడం లేదు. పోయిన ఏడాది ఇదే సమయంలో జేజేలను రూ.6,700కు అమ్ముకున్నాము. పంట దిగుబడి కూడా అంత ఆశాజనకంగా లేదు. శనగ సాగు అంటేనే భయంగా ఉంది.
– వెంకటేశ్వర్లు, శనగ రైతు, ఈదుమూడి