స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Jan 5 2025 12:31 AM | Updated on Jan 5 2025 1:02 AM

స్వయం

స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఒంగోలు వన్‌టౌన్‌: బీసీలకు, అగ్రవర్ణ పేదలకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎం వెంకటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓబీఎంఎంఎస్‌ పోర్టల్‌ ద్వారా ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. 17 నుంచి 19వ తేదీ వరకూ పరిశీలన ఉంటుందన్నారు. 20 నుంచి 24వ తేదీ వరకూ లబ్ధిదారులను మండల స్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపాల్టీల పరిధిలో మున్సిపల్‌ అధికారులు ఎంపిక చేస్తారన్నారు. మొత్తం 1648 మందికి రూ.40.63 కోట్ల రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల వయస్సు 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. లబ్ధిదారులకు తెల్లకార్డు, ఆధార్‌ కార్డు ఉండాలని చెప్పారు.

అంధుల సమస్యల

పరిష్కారానికి కృషి

జేసీ గోపాలకృష్ణ

ఒంగోలు వన్‌టౌన్‌: అంధుల సమస్యల పరిష్కారానికి అన్ని వేళల్లో అందుబాటులో ఉండి కృషిచేస్తానని జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ అన్నారు. లూయీ బ్రెయిలీ జయంతి వేడుకలను ఒంగోలు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు జీ అర్చన అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముందుగా కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న లూయీ బ్రెయిలీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శుక్రవారం అంధులకు నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. బ్రెయిలీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెప్మా, డీఆర్‌డీఏ పీడీ రవికుమార్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి యం.అంజల, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే ఆదిలక్ష్మి, మైనార్టీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ కే ధనలక్ష్మి, జిల్లా విజిలెన్స్‌ అధికారి ఝాన్సీ, ఐసీడీఎస్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి రవితేజ తదితరులు పాల్గొన్నారు.

అభ్యుదయ రైతులకు పురస్కారాల ప్రదానం

ఒంగోలు సిటీ: విజ్ఞాన్‌ యూనివర్సిటీ, రైతు నేస్తం ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ‘అభ్యుదయ రైతుల పురస్కారాలు–2025’ కార్యక్రమాన్ని శనివారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో నిర్వహించారు. రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు రైతులకు అభ్యుదయ రైతు పురస్కారాలు అందజేశారు. కొత్తపట్నం మండలంలోని దద్దాల రామారావు, పులి ఆదిలక్ష్మి, గుత్తికొండ వెంకట ఝాన్సీలక్ష్మి, సంతనూతలపాడు మండలానికి చెందిన శేషమ్మ ఈ పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కె.అచ్చంనాయుడు, నర్సరావుపేట పార్లమెంట్‌ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత యడవల్లి వెంకటేశ్వరరావు శాలువా, మెమొంటోలతో వారిని ఘనంగా సన్మానించారు. ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా ప్రాజెక్టు మేనేజరు సుభాషిణికి రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం 
1
1/1

స్వయం ఉపాధి రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement