అద్దంకిలో ఎస్‌జీఎఫ్‌ స్కేటింగ్‌ క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అద్దంకిలో ఎస్‌జీఎఫ్‌ స్కేటింగ్‌ క్రీడాకారుల ఎంపిక

Published Mon, Oct 30 2023 1:48 AM | Last Updated on Mon, Oct 30 2023 1:48 AM

-

ఒంగోలు: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర స్థాయి స్కేటింగ్‌ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 31న అద్దంకి ఒలంపియన్‌ స్పోర్ట్స్‌ అకాడమీ మార్కెట్‌ యార్డు రెండో గోడౌన్‌లో నిర్వహించనున్నట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె.వనజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, అండర్‌–11, అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో బాలబాలికలు పాల్గొనవచ్చని పేర్కొన్నా. పూర్తి వివరాలకు ఫిజికల్‌ డైరెక్టర్‌ విష్ణుప్రసాద్‌ 8121820000ను సంప్రదించాలని సూచించారు.

పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు

ఒంగోలు: భారతీయ తపాలా శాఖ ఆధ్వర్యంలో డిజిటల్‌ ఇండియా ఫర్‌ న్యూ ఇండియా అనే అంశంపై నిర్వహిస్తున్న పోటీల్లో విద్యార్థులు తమ సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని డీఈఓ వీఎస్‌ సుబ్బారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు తపాలా సర్కిల్‌ స్థాయి, జాతీయ స్థాయిలో బహుమతులు అందజేస్తారని పేర్కొన్నారు. ఎన్వలప్‌ కేటగిరీ, ఇన్‌లాండ్‌ లెటర్‌ కేటగిరీల్లో నిర్వహించనున్న ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. వయసు ద్రువీకరణ, రిజిస్టర్‌ లేదా స్పీడ్‌ పోస్టు ద్వారా ఎంట్రీలను సంబంధిత డివిజినల్‌ హెడ్‌ పోస్టాఫీజుకు ఈనెల 31వ తేదీలోగా పంపాలని సూచించారు. ఎంఈఓలు ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు తెలియజేసి ఎక్కువ మంది పోటీల్లో పాల్గొనేలా చూడాలని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement