
ప్రజలకు ఎంతగానో ఉపయోగం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇంటి వద్దకు వైద్య సేవలు అందించడం గర్వించదగిన విషయం. వైద్య ఆరోగ్య శాఖ పరంగా వైద్యుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరికీ తగిన సూచనలు, ఆదేశాలు ఇస్తున్నాం. జిల్లాలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా ఇంటింటికీ వైద్య సేవలు అందిస్తాం.
– రాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ