
పక్కాగా నిర్వహించేలా చర్యలు
ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతం చేసేలా హెల్త్ క్యాంపులు పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. పైలెట్ ప్రాజెక్టులా మోడల్ హెల్త్ క్యాంపులు నిర్వహించి ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించే హెల్త్ క్యాంపుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకున్నాం. విధులు కేటాయించిన అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసేలా ఆదేశాలు జారీ చేశాం. ఇంటింటి సర్వేలో తీసుకున్న ఆరోగ్య వివరాలను సంబంధిత యాప్‌లో నమోదుచేసి హెల్త్ క్యాంపుల్లో అవసరమైన వైద్య సేవలు, మందులు అందిస్తారు.
– ఏఎస్.దినేష్‌కుమార్, కలెక్టర్