‘లక్ష జనాభా ఉన్న చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చా?’ | YSRCP Spokesperson Vangaveeti Narendra Takes On Chandrababu | Sakshi
Sakshi News home page

‘లక్ష జనాభా ఉన్న చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చా?’

Apr 6 2026 4:08 PM | Updated on Apr 6 2026 4:33 PM

YSRCP Spokesperson Vangaveeti Narendra Takes On Chandrababu

తాడేపల్లి : అమరావతి నిర్మాణం వెనుక ఉన్నది భారీ దోపిడేనని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. లక్ష జనాభా ఉన్న చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయడం అంటే ఏంటని ప్రశ్నించారు. ఇది విజన్‌ ఉన్న వారు చేసే పనేనా అంటూ నిలదీశారు. 

ఈరోజు(సోమవారం, ఏప్రిల్‌ 6వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. వేల కోట్లు దోచుకునేందుకే అమరావతి ప్రాజెక్టు అని ధ్వజమెత్తారు. 

‘అడ్డూ అదుపులేని అవినీతికి కేరాఫ్ అడ్రస్ అమరావతి. రాష్ట్రంలో ఎక్కడైనా అడుగు నిర్మాణానికి రూ.2 వేలు ఖర్చు చేస్తున్నారు. కానీ అమరావతిలో రూ.12 వేల నుండి రూ. 14 వేలకు చేస్తున్నారు. అమరావతి నిర్మాణాల పేరున అడుగడుగునా అవినీతే. అందుకే ఏ టెండర్లు, జీవోలు బయటకు రాకుండా దాచి పెడుతున్నారు. ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వకపోవడానికి కారణం స్కాంలే. అసలు నిర్మాణాలకు అదనంగా లైటింగ్, పంబ్లింగ్, కరెంటు పేరుతో మళ్ళీ దోపిడీనా?, భారీగా జరుగుతున్న దోపిడీని‌ ప్రశ్నించిన వారిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు. పిచ్చి చెట్లు తొలగించటానికి కూడా వందల కోట్లు ఖర్చు చేస్తారా?, జనసంచారం లేని చోట రాజధాని కడతారా?, జనాభా ఉన్న చోట రాజధాని కట్టమని జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. 

కానీ వేల కోట్లు దోచుకునేందుకే చంద్రబాబు  అమరావతి అంటున్నారు. మావిగన్ పేరు నచ్చకపోతే పేరు మార్చుకోమని కూడా జగన్ చెప్పారు. కానీ రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆ లెక్కన చంద్రబాబు నాయుడిని చంబునాయుడు అనవచ్చా?, పేదవాడు రాజధానిలో ఉండటానికి వీల్లేదని కోర్టులో కేసు వేసిన ఘనత చంబునాయుడిది. రాజధానిలోకి ఎంటర్ కావాలంటే టిక్కెట్ కొనేలా  చంబునాయుడు వ్యవహార శైలి ఉంది. అమరావతిలో దోచుకున్నది విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరుగుతోంది’ అని విమర్శించారు.

పిచ్చి మొక్కలు.. వర్ష్పాలు వస్తే నీళ్లు తోడటం... ఇదే రాజధాని అభివృద్ది...

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement