వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. 11వ రోజు షెడ్యూల్‌.. | YSRCP Samajika Sadhikara Bus Yatra 11th Day Schedule | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. 11వ రోజు షెడ్యూల్‌..

Published Wed, Nov 8 2023 8:07 AM | Last Updated on Wed, Nov 8 2023 8:14 AM

YSRCP Samajika Sadhikara Bus Yatra 11th Day Schedule - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. నేడు సామాజిక సాధికార బస్సు యాత్ర పార్వతీపురం మన్యం, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో జరుగనుంది. ఇక, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి రాజన్న దొర ఆధ్వర్యంలో బస్సుయాత్ర కొనసాగనుంది. 

షెడ్యూల్‌ ఇలా.. పార్వతీపురం మన్యం జిల్లాలో..
►నేడు 11వ రోజు సామాజిక సాధికార యాత్ర
►సాలూరు, పాలకొల్లు, కనిగిరి నియోజకవర్గాలలో బస్సుయాత్ర
►ఉదయం 10:30 గంటలకు మెంటాడ మండలం పోరాం గ్రామంలో వైఎ‍స్సార్‌సీపీ నేతల మీడియా సమావేశం
►అనంతరం పోరాం గ్రామంలోని సచివాలయం సందర్శన.
►పెద్దమెడపల్లి, బూసాయవలస, రామభద్రపురం మీదుగా బస్సుయాత్ర
►మధ్యాహ్నం మూడు గంటలకు సాలూరు బోసు బొమ్మ జంక్షన్‌లో బహిరంగ సభ

ప్రకాశం జిల్లాలో..
►ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదనరావు ఆధ్వర్యంలో బస్సుయాత్ర
►నందన మారెళ్ల సెంటర్ నుండి బస్సుయాత్ర ప్రారంభం
►సురా పాపిరెడ్డి నగర్ దగ్గర లారీ అసోసియేషన్ సభ్యులతో సమావేశం
►వైఎస్సార్‌, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్న నేతలు
►ప్రభుత్వ కాలేజీలో "నాడు-నేడు" కార్యక్రమంపై విద్యార్థులతో సమావేశం.
►వైఎస్సార్‌భవన్‌లో రెండు గంటలకు విలేకర్ల సమావేశం
►సాయంత్రం నాలుగు గంటలకు పామూరు బస్టాండ్ వద్ద బహిరంగ సభ

పశ్చిమగోదావరి జిల్లాలో..
►పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో బస్సుయాత్ర
►శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో బస్సుయాత్ర
►పాలకొల్లు బైపాస్ రోడ్డు రామచంద్ర గార్డెన్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్సార్‌సీపీ నేతల ప్రెస్ మీట్
►అనంతరం పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ వరకు బస్సుయాత్ర
►గాంధీ బొమ్మల సెంటర్‌లో బహిరంగ సభ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement