చంద్రబాబూ.. ఆ మోసాన్ని గుర్తు తెచ్చుకో: దేవినేని అవినాష్‌

Ysrcp Leader Devineni Avinash Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: రాణిగారితోటలో నిన్నటి చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని,  40 ఇయర్స్ ఇండస్ట్రీ నేతకు 200 మంది కార్యకర్తలు కూడా రాలేదని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ దేవినేని అవినాష్‌ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గద్దె రామ్మోహన్, చంద్రబాబు అందరూ కట్టకట్టుకుని కృష్ణా నదిలో దూకాలంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘గత ఐదేళ్లలో కృష్ణలంక, రాణీగారి తోట ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. నిన్నటి సభ చూసైనా చంద్రబాబు ఈ ప్రాంతానికి చేసిన మోసాన్ని గుర్తు తెచ్చుకోవాలి. తూర్పు నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. సీఎం జగన్‌ ప్రభుత్వంలోనే రాణిగారితోట ప్రాంతం అభివృద్ధి చెందింది. ఇంటింటికీ కుళాయిలు అందించాం. చంద్రబాబు మీటింగ్ పెట్టుకున్న సభకు ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాల్ మేం నిర్మించిందే. రిటైనింగ్ వాల్ నిర్మించింది కూడా సీఎం జగన్‌ ప్రభుత్వమే’’ అని  దేవినేని అవినాష్‌ అన్నారు.
చదవండి: చంద్రబాబుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ సెగ.. ఈడ్చిపడేయాలంటూ ఆదేశాలు

‘‘సైకిల్ పోవాలని.. చంద్రబాబే తన మనసులో మాట బయటపెట్టాడు. బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం మేం ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి ఆలోచన నీకెప్పుడైనా వచ్చిందా చంద్రబాబు. గద్దె రామ్మోహన్ రాసిచ్చిన పేపర్ చదివి మమ్మల్ని విమర్శించావ్‌. రాణిగారితోట ప్రాంతంలో ముస్లిం మహిళలను రెచ్చగొట్టింది గద్దె రామ్మోహన్. టీడీపీలో కొందరు నారా లోకేష్‌ను ఫాలో అవుతున్నారు. వార్డు మెంబర్‌గా గెలవలేని వాళ్లను పార్టీలో చేర్చుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు’’ అని అవినాష్‌ దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top