
Breadcrumb
తెలంగాణ ఎన్నికలు-2023.. ఈరోజు అప్డేట్స్
Nov 9 2023 7:55 AM | Updated on Nov 9 2023 1:45 PM

Live Updates
తెలంగాణ ఎన్నికలు-2023.. ఈరోజు అప్డేట్స్
వెనకడుగు వేయను: సాక్షితో పొంగులేటి
- ఐటీ సోదాల అనంతరం సాక్షిటీవీతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- ఖమ్మంలోని నా ఇంట్లో సోదాలు ముగిసాయి
- నా బంధువుల ఇళ్లు, సంస్థలపై దాడులు ఇంకా జరుగుతున్నాయి
- ఐటీ అధికారులు రూల్స్ అతిక్రమించారు
- నా అల్లుడిని మ్యాన్ హ్యండలింగ్ చేసారు
- నా అభిమానులెవరూ ఆందోళన చెందవద్దు
- రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది
- నన్ను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా వెనుకడుగు వేయను..
- ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ గెలుస్తుంది
తీగల అజిత్ రెడ్డికి ఉల్లంఘన నోటీసులు
- మలక్‌పేట బీఆర్ఎస్ అభ్యర్థికి ఎలక్షన్ కోడ్ నిబంధనలు ఉల్లంఘన నోటీసులు
- తీగల అజిత్ రెడ్డికి చాదర్‌ఘాట్ పోలీసుల నోటీసులు
- కరపత్రాల సంఖ్య పేర్కొనకుండ విస్తృతంగా పంపిణీ చేశారని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ గుర్తింపు
- 41 సీఆర్పీసీ కింద అజిత్‌కు నోటీసులు అందజేత.
- విచారణకు ఆదేశించినపుడు హాజరుకావాలని పోలీసుల సూచన
- సౌత్ ఈస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రోహిత్ రాజ్ పర్యవేక్షణలో జరగనున్న దర్యాప్తు
కరీంనగర్: సర్దార్ రవీందర్ సింగ్‌పై కేసు నమోదు
►రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మెన్ సర్దార్ రవీందర్ సింగ్‌పై కేసు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు
►కరీంనగర్‌లోని ప్రైవేటు హోటల్లో బుధవారం ప్రెస్ మీట్ పెట్టిన రవీందర్ సింగ్.
►పోలీసులు చేస్తున్న బైండోవర్లపై ప్రెస్మీట్లో విమర్శలు చేసిన రవీందర్ సింగ్.
►ముందస్తు అనుమతి లేకుండా ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం, బైండ్ ఓవర్లపైన అవాస్తవాలు, అసత్య ప్రచారం చేశారన్న ఆరోపణలపై కేసు.
బీఆర్ఎస్ చెప్తేనే.. బీజేపీ చేస్తోంది: భట్టి
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలు
- ఓటమి భయంతోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల ఇండ్లలో ఐటీ దాడులు చేయిస్తోంది
- బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు కుమ్మక్కై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే కుట్రలు చేస్తున్నాయి
- ఐటీ దాడులు చేయమని బీఆర్ఎస్ చెప్తున్నది బీజేపీ చేస్తోంది
- ఐటీ, పోలీసుల దాడులతో కాంగ్రెస్ అభ్యర్థులను భయపెట్టాలని చూడడం అవివేకం
- కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!?
- బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!?
- రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న భయంతో బీఆర్ఎస్ బెంబేలెత్తిపోతోంది
- కాంగ్రెస్ అభ్యర్థులను భయపెట్టడానికి ఈ దాడులకు పాల్పడుతున్నది
- ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను.
- నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా..
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్
- అధికారికంగా ప్రకటించిన బీజేపీ
- సీనియర్ నటి జయసుధకు మొండిచెయ్యి
- సికింద్రాబాద్‌పై ఆశలు పెట్టుకుని బీజేపీలో చేరిక
- స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లోనూ చోటు దక్కని వైనం!
పొంగులేటితో తుమ్మల భేటీ
- తెలంగాణలో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ సోదాలు
- పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాల్లో ఉదయం నుంచి సోదాలు
- ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి చేరుకున్న తుమ్మల నాగేశ్వరరావు
- పొంగులేటితో తుమ్మల భేటీ
- భేటీలో కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ నేతలు కూడా
- తాజా పరిణామాలపై చర్చిస్తున్న తుమ్మల, పొంగులేటి
కాలు మీద రెండు చిన్న గాయాలయ్యాయి: కేటీఆర్
- ఆర్మూర్‌లో బీఆర్ఎస్ ప్రచార వాహనానికి ప్రమాదం
- సడన్ బ్రేక్ వేయడంతో వాహనం నుంచి పడిపోయిన నేతలు
- కిందపడ్డ ఎంపీ సురేష్‌రెడ్డికి గాయాలు
- సిబ్బంది అప్రమత్తతో కేటీఆర్‌కు తప్పిన ప్రమాదం
- జీవన్‌రెడ్డి, ఇతరులు సురక్షితం
- ప్రమాదం తర్వాత కొడంగల్‌లో కేటీఆర్ ప్రచారం
- ఆందోళన వ్యక్తం చేస్తూ సందేశాలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలంటూ సందేశం
- కాలు మీద రెండు చిన్న గాయాలు తప్ప బాగానే ఉన్నానంటూ కేటీఆర్ సందేశం
Wanted to sincerely thank everyone who have sent messages expressing concern after the freak accident in Armur today
— KTR (@KTRBRS) November 9, 2023
I am doing well barring a couple of minor injuries on the leg. Continued with my campaign in Kodangal
Thanks Again 🙏
బీజేపీ గెలిచేది ఐదారు సీట్లే: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి
►భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి
►బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదు: కోమటిరెడ్డి
►బీఆర్ఎస్కు ఓటువేస్తే బీజేపీకి వేసినట్లే
►కాంగ్రెస్ పార్టీ గెలవద్దని రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయి
►లక్షల కోట్ల రూపాయల దోచుకున్న అధికార పార్టీని వదిలి పెట్టి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు చేయడం ఏంటి?
►కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
►కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ, సెల్ ఫోన్లు ధ్వంసం చేసిన కూడా అరెస్ట్ చేయకపోవడం ఏంటి?
►కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు.
►నాలుగు కోట్ల ప్రజల కోసం నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి.
►బీజేపీ గెలిచేది ఐదారు సీట్లే
►భువనగిరి గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం.
కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే బాధ్యత నాది: కేటీఆర్
► 9 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు.
► కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. కరెంటు పోయిది.
►రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కొడంగల్ పేరును నాశనం చేశాడు.
►కేసీఆర్‌కు సవాల్ విసురుతున్న రేవంత్‌ను చూస్తుంటూ.. తెగ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడ కొడుతున్నట్లు ఉంది.
► జనంలో ఉండే నాయకుడు కావాలా? జైలుకి వెళ్లే నాయకుడు కావాలా?
►రేవంత్ రెడ్డికి కేసీఆర్ అక్కర్లేదు.. మా నరేందర్ రెడ్డి చాలు.
►నరేందర్ రెడ్డి గెలిచిన తరువాత పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకం ద్వారా సాగు నీటిని అందిస్తాం.
బిడ్డతో కలిసి నామినేషన్‌కు జగ్గారెడ్డి
- సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గారెడ్డి నామినేషన్ దాఖలు
- నామినేషన్ దాఖలుకు జగ్గారెడ్డి వెంట వచ్చిన కూతురు జయరెడ్డి
- కౌన్సిలర్ షాఫీ హఫీజ్, సోమేశ్వర్, కట్టేకొమ్ము రవి తదితరులు కూడా
మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్..
- మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ
- మైనారిటీల ఆర్థిక ఉద్ధరణ & సాధికారత ధ్యేయం పేరిట ప్రకటన
- మైనారిటీల సంక్షేమ బడ్జెట్ రూ.4,000 కోట్లకు పెంపు
- ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్
- నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు
- రుణాల కోసం ఏడాది రూ. 1,000 కోట్లు
- అబ్దుల్ కలాం తౌఫా-ఎ-తలీమ్ పథకం
- పథకం కింద.. ఎంఫిల్ పూర్తి చేస్తున్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ఇతర మైనారిటీ యువతకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం
- తెలంగాణ సిక్కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ని స్థాపించి, మైనారిటీ సంస్థలలో ఖాళీల భర్తీ
- ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ
- ఇమామ్‌లు, మ్యూజిన్లు, ఖాదీమ్‌లు, పాస్టర్లు మరియు గ్రంథిలతో సహా అన్ని మతాల పూజారులకు నెలవారీ గౌరవ వేతనం రూ.10,000-12,000
- వక్ఫ్ బోర్డు యొక్క భూమి, ఆస్తి రికార్డులను డిజిటలైజేషన్
- వక్ఫ్ బోర్డ్ యొక్క ఆక్రమణకు గురైన ఆస్తులను తిరిగి స్వాధీనం
- ముస్లిం-క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి
- ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇళ్లులేని మైనారిటీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం
- ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు
- రూ. 1,60,000/- ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఇతర మైనారిటీలకు చెందిన కొత్తగా పెళ్లైన జంటలకు సహాయం
పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి పేరు ప్రకటన
- పెద్దపల్లిలో ఉత్కంఠకు తెర దించిన బీజేపీ
- అభ్యర్థిగా దుగ్యాల ప్రదీప్ రావు పేరు ప్రకటన
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న దుగ్యాల ప్రదీప్ రావు
- ప్రదీప్ రావు స్వస్థలం జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి
లిక్కర్ స్కామ్‌లో కవితను కచ్చితంగా జైలుకు పంపిస్తాం: కేంద్రమంత్రి
►హంటర్ రోడ్ శ్రీ సాయి బాంకేట్ హాల్లో మీడియా సెంటర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని చౌబే
►మహిళలు బీజేపీ వైపు ఉన్నారు: కేంద్రమంత్రి
►కేసీఆర్ కుటుంబం అవినీతిలో కూరుకుంది.
►ప్రజల సొమ్మును దోచుకున్నారు.
► గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత రూ. 100 కోట్లు ఇచ్చారు.
► లిక్కర్ స్కామ్‌లో కవితను కచ్చితంగా జైలుకు పంపిస్తాం.
► తెలంగాణలో కమలం వికసిస్తుందనే నమ్మకం ఉంది.
► బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒకటే... బీజేపీని ఎదుర్కోలేక రెండు పార్టీలు ఏకమయ్యాయి.
మంత్రి ఎర్రబెల్లిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్
►ఎర్రబెల్లి మిత్ర ద్రోహి, నమ్మక ద్రోహి
►తెలంగాణలో టీడీపీ దెబ్బతినడానికి ఎర్రబెల్లి చేసిన కుట్రలే కారణం
►నేను జైలుకు వెళ్లడానికి ఎర్రబెల్లే కారణం.
►అభివృద్ధిలో కాదు.. తాగుడులో తెలంగాణ నెంబర్ వన్.
►రాజ్యసభ సీట్లను అమ్ముకున్న వ్యక్తి కేసీఆర్.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై 9 కేసులు
►బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై 9 కేసులు
►ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న సీఎం కేసీఆర్
► తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులు
►రూ. 2.96 లక్షల నగదు, రూ, 17 లక్షల విలువైన బంగారం ఉన్నట్లు వెల్లడి
►సీఎం కేసీఆర్, శోభమ్మ పేరులతో రూ. 17 కోట్ల డిపాజిట్లు
►కేసీఆర్ తొమ్మిది బ్యాంక్ అకౌంట్లు, శోభమ్మకు మూడు అకౌంట్లు
►తన భార్య శోభమ్మ పేరిట ఎలాంటి భూములు లేవన్న కేసీఆర్
►ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేవని తెలిపిన సీఎం
►తమ కుటుంబానికి 14 కార్లు ఉన్నట్లు పేర్కొన్న కేసీఆర్
►కుటుంబం పేరుతో 62 ఎకరాల భూమి ఉన్నట్లు వెల్లడి
జనగామ: ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి నామినేషన్ వేసిన కడియం
► జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
►స్టేషన్ ఘన్పూర్ ప్రస్తుతం ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి రెండో సెట్ నామినేషన్ దాఖలు.
కార్యకర్తల ఉత్సాహంతో గెలుపు ఖాయంగా భావిస్తున్నా: తమ్మినేని
► ఖమ్మం రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ అనంతరం మీడియా సమావేశంలో తమ్మినేని వీరభద్రం.
►మేము ఊహించిన దానికంటే మహిళలు యువకులు, నాయకులు నామినేషన్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
►కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నా విజయం ఖాయంగా భావిస్తున్నా.
►ఎన్నో కష్టనష్టాలు ఓర్చి ఉద్యమాలు నిర్మించిన చరిత్ర నాకుంది.
►ప్రజల సమస్యల కోసం 4,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా.
►2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నో ఉద్యమాల్లో క్రియాశీలకంగా ఉన్నాను.
► ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా మా తండ్రి పోరాడారు..
►సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న చరిత్ర నాకుంది.
►ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని సీపీఎంకు ఓటేయాలి.
►రాబోయే ఇరవై రోజుల్లో కార్యకర్తలు అవిశ్రాంతంగా పని చేసి నన్ను గెలిపించాలి.
►శాసనసభలో మన గడ్డ కోసం ప్రజల హక్కుల కోసం పోరడతాను.
50 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది?: సీఎం కేసీఆర్
►50 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది.
►నెహ్రూనే దళితబంధు పెట్టి ఉంటే.. ఇప్పుడు దళితుల పరిస్థితి ఇలా ఉండేదా?
►బీడీ కార్మికులు అందరికీ పెన్షన్ ఇస్తా.
►రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
►రైతు బంధు ఉండాలా.. వద్దా?
►ఎప్పుడూ వ్యవసాయం చేయని రాహుల్ గాంధీ.. ధరణి తీసేస్తాం అంటున్నారు.
►24 గంటలు కరెంట్ కావాలా. 3 గంటల కరెంట్ కావాలా?
►మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. మనం ఇస్తున్నాం.
►ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వని బీజేపీకి.. ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి.
కామారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభ

►కామారెడ్డిలో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్
►కామారెడ్డితో చిన్నప్పటి నుంచే అనుబంధం ఉంది: సీఎం కేసీఆర్
►కామారెడ్డి నుంచి పోటీచేయాలని ఇక్కడి నాయకులు కోరారు.
►గత ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చాం.
►నేను కామారెడ్డికి వస్తే చాలా వస్తాయి.
►కేసీఆర్ వెంట, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయి.
►కామారెడ్డి పల్లెల రూపురేఖలు మార్చే బాధ్యత నాదే.
కేటీఆర్‌కు తప్పిన ముప్పు
- కేటీఆర్ యాత్రలో అపశ్రుతి
- ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో తప్పిన పెను ప్రమాదం
- నిజామాబాద్ ప్రచారంలో వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా ముందుకు పడిపోయిన నేతలు
- ఓపెన్ టాప్ వాహనం నుంచి ముందకు పడబోయిన కేటీఆర్, ఇతర నేతలు
- ముందున్న బారికేడ్ విరిగి అక్కడితోనే పడకుండా ఆగిపోయిన నేతలు
- మినీ బస్ పై నుంచి కింద పడిన ఎంపీ సురేష్ రెడ్డి.. గాయాలు
ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత.. రాచకొండ సీపీ సమీక్ష
- హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
- నామినేషన్ల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
- ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు
- ఘటనా స్థలానికి చేరుకున్న రాచకొండ సీపీ చౌహన్
- పరిస్థితిని సమీక్షిస్తున్న చౌహాన్
బాల్కొండలో ముత్యాల సునీల్ నామినేషన్
- నిజామాబాద్ జిల్లా బాల్కొండలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్
- కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్యాల సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు
కామారెడ్డిలో నామినేషన్ వేసిన కేసీఆర్
- కామారెడ్డిలో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్
- రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన సీఎం కేసీఆర్
- పలు వర్గాల నుంచి బలపరిచిన నేతలు
- గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయనున్న కేసీఆర్
కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలోకి కేసీఆర్
- కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం లోకి వెళ్ళిన సీఎం కేసీఆర్
- ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కామారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సీఎం
ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత.. కార్యకర్తల రాళ్ల దాడి
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
- బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య రాళ్ల వర్షం.
- ఒకేసారి రెండు పార్టీల భారీ ర్యాలీ
- ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్న కార్యకర్తలు
- పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలు
- మల్రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా గొడవ
బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ క్లాస్
- కామారెడ్డిలో బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు.
- ఇటీవల కామారెడ్డి, హైదరాబాద్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై సీఎం ఆరా తీరారు.
- ఈ సందర్భంగా కలిసికట్టుగా పనిచేయాలని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
అమరావతి తరహాలో కొత్త సిటీ క్రియేట్ చేస్తాం: రేవంత్ రెడ్డి
- ఇండియా టుడే సదస్సులో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
- హైదరాబాద్‌లో అమరావతి తరహాలో కొత్త సిటీ క్రియేట్ చేస్తాం
- ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉన్నాయి
- రాచకొండలో మరో నగరాన్ని నిర్మిస్తాం
- రాచకొండలో 50 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేస్తాం
- అందులోనే బిజినెస్ సెంటర్, టూరిజం, సాఫ్ట్వేర్ అన్నీ ఉంటాయి
- దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు అవసరం లేదు
బోధన్‌లో బైక్ ఎక్కిన కవిత
- ఎమ్మెల్యే షకీల్ నామినేషన్ సందర్భంగా బోధన్ లో భారీ ట్రాఫిక్ జామ్
- భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు
- బైక్ పై ర్యాలీ ప్రారంభ స్థలికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
- ఎమ్మెల్సీ కవితకు సాదర స్వాగతం పలికిన బీఆర్ఎస్ కార్యకర్తలు
తగ్గేదేలే.. పొంగులేటి భారీ ర్యాలీ
- ఖమ్మంలో రసవత్తరంగా రాజకీయం
- నామినేషన్ దాఖలుకు బయలుదేరిన పొంగులేటి
- ఖమ్మంలో భారీ ర్యాలీతో పొంగులేటి
- భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు
కీలక నేతల నామినేషన్స్..
- కరీంనగర్లో మంత్రి గంగుల నామినేషన్ దాఖలు.
- మధిరలో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన భట్టి విక్రమార్క
- మధిరలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కమల్‌రాజ్ నామినేషన్
- హుజూర్‌నగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి.
- సికింద్రాబాద్ నార్త్ జోన్ జీహెచ్ఎంసీ ఆఫీసులో మంత్రి తలసాని నామినేషన్ దాఖలు
- స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి నామినేషన్
- వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ
కామారెడ్డికి సీఎం కేసీఆర్
- కామారెడ్డి చేరుకున్నసీఎం కేసీఆర్
- కాసేపట్లో నామినేషన్ వేయనున్న కేసీఆర్
- నామినేషన్ అనంతరం కేసీఆర్ బహిరంగ సభ
కేటీఆర్ నామినేషన్ దాఖలు
- సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు.
- సిరిసిల్ల ఆర్డీవో ఆఫీసులో నామినేషన్ వేశారు.
- కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ సిరిసిల్లకు ఏం చేసిందో ప్రశ్నించండి.
- తెలంగాణకు ఉన్న ఒకేఒక గొంతును నొక్కాలని రాహుల్, మోదీ దండయాత్ర చేస్తున్నారు.
- ఇక, అనంతరం.. ఆర్మూర్, కొడంగల్‌లో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు.
ఎన్నికల సంఘానికి పొంగులేటి ఫిర్యాదు
- ఐటీ దాడులపై ఎన్నికల సంఘానికి పొంగులేటి ఫిర్యాదు
- ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో ఐటీ దాడులకు ప్లాన్
- కుట్రపూరితంగా నామినేషన్ అడ్డుకోవాలని ప్లాన్ చేశారు.
- బీఆర్ఎస్, బీజేపీ ఫెవికాల్ బంధం ఏంటనేది దీంతో బయటపడింది.
- ఐటీ దాడుల విషయం ముందుగానే తెలుసు.
- నా నామినేషన్ అడ్డుకోవాలని అనుకోవడం ఆ రెండు పార్టీ భయాన్ని చూపిస్తోంది.
నామినేషన్ కోసం అంబులెన్స్‌లో వచ్చిన ప్రభాకర్
- దుబ్బాక స్థానానికి కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్
- సిద్దిపేటలో కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్
- హైదరాబాద్ నుంచి అంబులెన్స్‌లో సిద్దిపేటకు కొత్త ప్రభాకర్ రెడ్డి
- ఇటీవల ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్
- స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ఈసీ ఆఫీస్‌కి పంపిన బీఆర్ఎస్ పార్టీ
- బీఆర్ఎస్ తరఫున 38 మంది పేర్లతో లిస్టును అందజేసిన అధికార పార్టీ
- సీఎం కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీష్ రావు, కేబినెట్ మంత్రుల పేర్లతో పాటు 38 మంది
పరకాలలో ఉద్రిక్తత
- పరకాలలో బీఆర్ఎస్ Vs కాంగ్రెస్
- ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసు వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య హోరాహోరీ నినాదాలు
- ఒకేసారి నామినేషన్ వేయడానికి వచ్చిన రేవూరి ప్రకాశ్, చల్లా ధర్మారెడ్డి
- కాంగ్రెస్ తరఫున రేవూరి ప్రకాశ్ రెడ్డి నామినేషన్ దాఖలు
- బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నామినేషన్ వేసిన చల్లా ధర్మారెడ్డి
- పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత, కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు
హరీష్ రావు ప్రత్యేక పూజలు
- నామినేషన్ సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు.
- సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు
- అనంతరం నామినేషన్ దాఖలు చేసిన హరీష్ రావు
సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమకు ఊరట
- సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమకు ఊరట లభించింది.
- ఎన్నికల వేళ హ్యాక్ అయిన రాణి రుద్రమ ఫేస్బుక్ అకౌంట్
- ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేసిన రాణి రుద్రమ
- రాజకీయ ప్రత్యర్థులే హ్యాక్ చేయించారని ఫిర్యాదు
- స్పందించిన ఫేస్బుక్, అకౌంట్ పునరుద్దరణ.
- తొలి విజయంగా అభివర్ణించిన రాణి రుద్రమ సేన
చెన్నూరులో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ Vs కాంగ్రెస్
- నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చెన్నూరులో ఉద్రిక్తత.
- మంచిర్యాల జిల్లా చెన్నూర్ నామినేషన్ కేంద్రం వద్ద హైటెన్షన్
- ఒకేసారి నామినేషన్ వేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్
- బాల్క సుమన్ వాహనాన్ని కార్యాలయం లోపలి వరకు అనుమతి
- కాంగ్రెస్ అభ్యర్థి వాహనాన్ని అనుమతించని అధికారులు
- అధికారులతో వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు
- ఇరు పార్టీల కార్యకర్తలు నేతల మధ్య తోపులాట
- పోలీసుల రంగ ప్రవేశం, ఇరువర్గాలు శాంతింపజేస్తున్న పోలీసులు
సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు

- గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సీఎం కేసీఆర్
- రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేసిన కేసీఆర్
- కాసేపట్లో కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్న కేసీఆర్
- గజ్వేల్, కామారెడ్డిలో పోటీ చేస్తున్నా సీఎం కేసీఆర్
- సిద్దిపేటలో హారీష్ రావు నామినేషన్
- సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నామినేషన్ దాఖలు చేశారు.
- సిరిసిల్లలో కేటీఆర్ నామినేషన్
- సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు.
- సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావుతో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేసిన కేటీఆర్.
నామినేషన్లలో నేతలు బిజీ

- తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల ఘట్టం
- నిన్న ఒక్కరోజే 713 నామినేషన్లు దాఖలు
- బుధవారం, గురువారం మంచి ముహూర్తాలు ఉండటంతో భారీ సంఖ్యలో దాఖలైన నామినేషన్లు
- బుధవారం వరకు మొత్తం 15వందల నామినేషన్లు దాఖలు
- రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
కాసేపట్లో సూర్యాపేటలో జగదీష్ రెడ్డి నామినేషన్
- మంత్రి జగదీష్ రెడ్డి కాసేపట్లో నామినేషన్ వేయనున్నారు.
- నామినేషన్‌కు ముందు ప్రత్యేక పూజలు చేసిన జగదీష్ రెడ్డి
- ఈ సందర్బంగా బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు.
ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రియాక్షన్

ఖమ్మం:
- ఐటీ దాడులు జరుగతాయని నాకు ముందే తెలుసు
- రాష్ట్రంలో కాంగ్రెస్‌పై దాడి జరుగుతోంది
- కాంగ్రెస్ నేతలను భయపెట్టాలని చూస్తున్నారు
- నేను ఏ తప్పు చేయలేదు
- నాపై కేసులు పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయి
- ఓటమి భయంతోనే ఐటీ దాడులు చేయిస్తున్నారు
ఐటీ దాడులపై రేవంత్ ధ్వజం
- నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్ల పై ఐటీ దాడులు దేనికి సంకేతం!?
- బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!?
- రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ - కేడీ బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది.
- ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను.
- నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం.
గజ్వేల్‌కు సీఎం కేసీఆర్
- గజ్వేల్ చేరుకున్న సీఎం కేసీఆర్
- కాసేపట్లో ఆర్వో ఆఫీస్‌లో నామినేషన్ వేయనున్న సీఎం కేసీఆర్
నామినేషన్ వేయడానికి బయల్దేరిన కేటీఆర్
- సిరిసిల్లలో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- సిరిసిల్లకు బయలుదేరే ముందు తన నివాసం ప్రగతి భవన్లో పూజలు నిర్వహించిన కేటీఆర్
- ఉదయం గం. 11:45 నిమిషాలకు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేయనున్న కేటీఆర్
- ఆ తర్వాత ఆర్మూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో రోడ్ షోలలో పాల్గొననున్న కేటీఆర్
నేడు బీజేపీ ఐదో జాబితా విడుదల చేసే అవకాశం
- ఇవాళ(గురువారం) బీజేపీ ఐదో జాబితా విడుదల చేసే చాన్స్
- మరో 11 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
- శేరిలింగంపల్లి, సంగారెడ్డి, మాల్కాజగిరి సీట్లపై సస్పెన్స్
పొంగులేటి ఇంటికి మరికొందరు అధికారులు

- కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి
- హైదరాబాద్ నుంచి మరికొంత మంది అధికారులు ఖమ్మం చేరుకున్నారు.
- సోదాల్లో అధికారులు పాల్గొన్నారు.
- హైదరాబాద్‌లో ఉన్న పొంగులేటి ఇంట్లో సైతం కొనసాగుతున్న సోదాలు.
- మరోవైపు.. పొంగులేటి ఇంటికి భారీగా తరలివస్తున్న ఆయన అభిమానులు
- పొంగులేటి జిందాబాద్.. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.
ప్రచారంలో రేవంత్ ఫుల్ బిజీ
- నేడు పాలకుర్తి, సికింద్రాబాద్, సనత్‌నగర్‌లో రేవంత్ ప్రచారం
- మధ్యాహ్నం 12 గంటలకు పాలకుర్తిలో కాంగ్రెస్ బహిరంగ సభ
- మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ సిటీ కన్వెన్షన్‌లో మైనార్టీ డిక్లరేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్
- సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్, 6:30 గంటలకు సనత్‌నగర్‌లో రేవంత్ సభలు
కాంగ్రెస్ టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
- కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాల్‌రాజ్ ఆత్మహత్యాయత్నం
- కార్యకర్తలు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.
- ప్రస్తుతం నిజామాబాద్ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్న ఆయన కోలుకుంటున్నట్లు తెలిసింది.
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ టికెట్ కోసం బాల్‌రాజ్ విశ్వప్రయత్నాలు చేశారు.
- అధిష్టానం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి సీటు ఖరారు చేసింది.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ నామినేషన్లు
- నేడు సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో నామినేషన్ వేయనున్నారు.
- కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు.
- అనంతరం, కామారెడ్డి సభలో పాల్గొననున్న కేసీఆర్
- నేటితో ముగియనున్న మొదట విడత కేసీఆర్ ప్రచారం
- సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు నామినేషన్ వేయనున్నారు.
- సిరిసిల్లలో కేటీఆర్ నామినేషన్ వేయనున్నారు.
- ఉదయం 11:45 గంటలకు సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్ దాఖలు.
- సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న కేకే. మహేందర్ రెడ్డి
- ఉదయం 11:30 గంటలకు నామినేషన్ దాఖలు
- తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్‌లో నామినేషన్ వేయనున్నారు.
- సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.
- కాంగ్రెస్‌లో ఇలా..
- హుజూర్నగర్ నగర్లో ఉదయం 11 గంటలకు పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్
- రేపు భారీ రోడ్ షోకు హాజరుకానున్న కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్
- రేపటితో నామినేషన్ల దాఖలుకు ముగియనున్న గడువు.
పొంగులేటి ఇంట్లో ఐటీ సోదాలు
- కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
- ఏక కాలంలో పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
- గురువారం తెల్లవారుజామునే ఎనిమిది వాహనాల్లో ఐటీ అధికారులు వాహనాల్లో పొంగులేటి ఇంటికి చేరుకున్నారు.
- ఖమ్మంలోని ఆయన ఇంట్లో, పాలేరులోని క్యాంపు ఆఫీసులు దాడులు తనిఖీలు జరుపుతున్నారు.
- నేడు పొంగులేటి నేడు నామినేషన్ వేసేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.
Related News By Category
-
‘బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుంది’
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత ఇచ్చిన ఝలక్‌తో కేటీఆర్‌కు మతి భ్రమించిందన్నారు. ఇంట్లో...
-
సిస్టర్ స్ట్రోక్‌తోనే కేటీఆర్ అలా మాట్లాడారు: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తాజాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. గోబెల్స్ ప్రచ...
-
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది అంటూ కవితకు కేటీఆర...
-
రేవంత్ రాజీనామా చేయాల్సిందే.. బీజేపీ నేతలెందుకు స్పందించరు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హస్తి...
-
కవిత లేఖ కలకలం.. కేటీఆర్ కీలక ప్రెస్‌మీట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత వ్యాఖ్యలపై పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో...
Related News By Tags
-
కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ.. ఇండియా టుడే సర్వే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్‌పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 119 అసెంబ్లీ ని...
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update.. ఎల్లుండి(డిసెంబర్ 3, ఆదివారం) తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న అధికారులు తెలంగాణ : లెక్కింపు కేంద్రాల ...
-
తెలంగాణలో ముగిసిన పోలింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. కానీ, పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారుల...
-
TS Elections: పలుచోట్ల ఉద్రిక్తత.. కోడ్ ఉల్లంఘిస్తున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ సీఈవో, సీని ప్రముఖులు, రాజకీయ నాయకులు...
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. ఈరోజు అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Updates.. ఈసీ సీఈఓ వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు పోలింగ్ ప్రారంభానికి 90 నిమిషాల ముందు ఉ.5:30 గం.లకు మాక్ పోలింగ్ రాజకీయ పార్టీల ఏజెంట్లు సమ...