వైరల్‌: తీన్మార్‌ స్టెప్పులేసిన కమల్‌ కూతురు, సుహాసిని

Tamil Nadu Assembly Elections 2021: Akshara, Suhasini Dance Campaign - Sakshi

సాక్షి, చెన్నై: విశ్వనటుడు కమల్‌ హాసన్‌ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్‌ కుమార్తె సుహాసిని కూడా సుడిగాలి ప్రచారంలో భాగమయ్యారు. వీరికి తోడుగా కమల్‌ కూతురు అక్షర హాసన్‌ కూడా క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కమల్‌కు ఓటేయడంటూ అక్షర, సుహాసిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ డప్పు చప్పుళ్లకు తీన్మార్‌ డ్యాన్స్‌లు చేసి జనాలను ఆకట్టుకున్నారు. బ్యాండ్‌ సౌండ్‌కు ఎంతో ఎనర్జిటిక్‌గా స్టెప్పులేసిన వీరి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: కమల్‌ పార్టీ అభ్యర్థి ఇంట్లో రూ.10 కోట్ల నగదు స్వాధీనం

ఒకే వేదికపై మామ అల్లుడు (రజనీకాంత్‌, ధనుష్‌)కు అవార్డులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top