Revanth Reddy Comments On MLA Jagga Reddy Resignation And His Comments In Mulugu Dist - Sakshi
Sakshi News home page

జగ్గారెడ్డి అలక టీ కప్పులో తుఫాన్: రేవంత్‌రెడ్డి

Feb 19 2022 4:15 PM | Updated on Feb 19 2022 5:38 PM

Reavant Reddy Recation On Jaggaredy Comments Mulugu District - Sakshi

ములుగు జిల్లా: కాంగ్రెస్ సీనియర్‌ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారన్న విషయంపై తెలంగాణ పీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మేడారం సమ్మక్క సారలమ్మను శనివారం దర్శించుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి విషయం టీ కప్పులో తుఫాన్ లాంటిదని అన్నారు.

భేదాభిప్రాయాలే తప్ప విభేదాలు కావుని స్పష్టం చేశారు. కుటుంబంలో కలహాలు ఉన్నట్టే పార్టీలో బేధాభిప్రాయాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది భిన్నత్వంలో ఏకత్వమని, ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వం ఉంటుందని అన్నారు.

కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువని, అన్ని పరిస్థితులు సర్థుకుంటాయని పేర్కొన్నారు. పోలీసులపై మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, ఆవేశంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement