కాంగ్రెస్ బ్లాక్ పేపర్.. దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ బ్లాక్ పేపర్.. దిష్టిచుక్కగా అభివర్ణించిన ప్రధాని మోదీ

Published Thu, Feb 8 2024 12:00 PM

PM Modi Kala Tika Jibe On Congress Party Black Paper - Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్ విడుదల చేసిన 'బ్లాక్ పేపర్‌'ను ప్రధాని మోదీ దిష్టిచుక్కగా అభివర్ణించారు. తమ ప్రభుత్వంపై చెడుచూపు పడకుండా చూస్తుందని అన్నారు. ప్రతిపక్షాల ఇటువంటి చర్యను కేంద్ర ప్రభుత్వం కూడా స్వాగతించిందని అన్నారు. కాంగ్రెస్‌ చీఫ్ మల్లికార్జున ఖర్గే 'బ్లాక్ పేపర్' విడుదల చేసిన తర్వాత కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్రం నేడు 'శ్వేతపత్రం'ను విడుదల చేయనుంది. ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్'ను విడుదల చేసింది. కేంద్రం ఆర్థిక వ్యవస్థపై విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల కష్టాలు వంటి కేం‍ద్రం వైఫల్యాలను 'బ్లాక్ పేపర్‌' లో పేర్కొన్నామని కాంగ్రెస్ ప్రకటించింది.

కాంగ్రెస్ బ్లాక్ పేపర్ విడుదల చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. "ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్లాక్ పేపర్ విడుదల చేస్తున్నాం. ఎందుకంటే పార్లమెంట్‌లో మాట్లాడినప్పుడల్లా కేంద్రం విజయాల గురించే మాట్లాడుతారు. కానీ సొంత వైఫల్యాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ వైఫల్యాల్ని మాట్లాడటానికి కూడా మమ్మల్ని అనుమతించరు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్య.. కానీ కేంద్రం ఎప్పుడూ మాట్లాడలేదు.” అని మల్లికార్జున ఖర్గే అన్నారు.  

ఇదీ చదవండి: మన్మోహన్ సింగ్‌పై ప్రధాని మోదీ ప్రసంశలు

Advertisement
 
Advertisement