సాగర్‌ ఉప​ ఎన్నిక: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖరారు!

Nagarjuna Sagar By Polls 2021: TRS Candidate Finalized - Sakshi

సాక్షి, నల్గొండ: నాగర్జున సాగర్‌ ఉప ఎన్నికకు టీఆర్‌​ఎస్‌ పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. కాసేపట్లో భగత్‌కు సీఎం కేసీఆర్‌ బీ-ఫామ్‌ అందజేయనున్నారు. రేపు ఉదయం భగత్‌‌ తన నామినేషన్‌ వేయనున్నారు. కాగా నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గతేడాది డిసెంబర్‌లో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే  కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ప్రకటించింది. ఇక బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు గడువు ఉంది. ఈనెల 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. కాగా ఏప్రిల్‌ 17న నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనుండగా, మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(టీఆర్‌ఎస్‌) ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం విదితమే.

చదవండి: ఇలాంటి సవాల్‌ చేసిన చరిత్ర దేశంలో నా ఒక్కడిదే

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top