దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలా..?: మంత్రి కన్నబాబు

Minister Kannababu Comments On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.18,777 కోట్లు ఇచ్చామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. మంగళవారం వైఎస్సార్ రైతు భరోసా, సున్నావడ్డీ, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పంట రుణ మాఫీ కింద రూ.12,500 కోట్లు ఇస్తే ఈ రెండున్నరేళ్లలో 18,777 కోట్లు ఇచ్చాం. మేనిఫెస్టోలో రైతు కోసం ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారు. కేవలం తన రాజకీయాల కోసం ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ప్రజల ఖ్యాతిని చంద్రబాబు తగ్గిస్తున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు ఢిల్లీ వీధుల్లో చెప్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఇతర రాష్ట్రాలు ఏమనుకుంటాయి. మీరు తిట్టిన తిట్లు వాళ్లకి గుర్తు ఉండవా..?.

రాష్ట్రపతి రాజధాని గురించి అడిగితే నాశనం చేశారని చెప్పారట. పదేళ్ల హక్కును వదిలేసి ఇక్కడికి పారిపోయి వచ్చి మేమేదో నాశనం చేశామని చెప్పారట. మీ రియల్ ఎస్టేట్ అవసరాల కోసం మూడు రాజధానులు అడ్డుకుని మాపై నిందలా?.  దిగజారుడు రాజకీయాలు చేసి ఢిల్లీ వీధుల్లో డ్రామాలు చేస్తున్నారా?. పార్టీ బతికుందని చెప్పుకునే ప్రయత్నం కాదా?. పుస్తకాల్లో పేర్లు రాసుకోవడం కాదు మా కార్యకర్తపై చెయ్యి వేసి చూడండి. ఈ డ్రామాలన్నీ మోదీ, అమిత్ షాలకు తెలుసు. వాళ్లకి ఇక్కడి వాస్తవ పరిస్థితులు తెలియవా? ఆయన మాట్లాడిన మాటలు వాళ్లకు తెలియదా..?. తప్పకుండా ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేస్తాం. ఎప్పుడు 356 పెట్టాలో వాళ్ళకి తెలియదా?. చంద్రబాబుకి ముందు నిబద్ధత, క్రమశిక్షణ, కట్టుబాటు లేదు అంటూ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్‌ అయ్యారు.

చదవండి: (రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్‌)

ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్‌ నాగిరెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే రైతుకు పెట్టుబడి సాయంగా నగదు ఇవ్వడం ఇక్కడే జరిగింది. అక్టోబర్ నెల రైతుకు చాలా కీలకం. అందుకే మూడు విడతలుగా విభజించాము. రైతులకు మేలు చేయడం కోసం రూ.12,500 నుంచి 13,500 చేశారు. కౌలు రైతులకు కూడా ఈ భరోసా అందిస్తున్నాం. చెప్పిన మాట చెప్పినట్లుగా విడుదల చేస్తున్న ప్రభుత్వం మాది. ఇంత సంక్షోభంలోనూ అమలు చేయడం సామాన్యమైన విషయం కాదు. టీడీపీ ప్రతిపక్షంలోకి రాగానే తాము చేసిన మోసాలు మర్చిపోయారు అని ఎంవీఎస్‌ నాగిరెడ్డి అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top