
తాడేపల్లి: జనసేన పార్టీని, ఆ పార్లీ అధినేత పవన్ కల్యాణ్‌ను తాము అసలు గుర్తించడం లేదని మంత్రి కాకాణి గోవర్థన్ స్పష్టం చేశారు. నిబద్ధత లేని వ్యక్తి గురించి, ఆ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. పవన్ కల్యాణ్ స్థాయి తోలుబొమ్మలాటలో జోకర్ మాత్రమేని మంత్రి కాకాణి విమర్శించారు. ‘కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే మీ పని.
వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ ఆర్థిక సాయంతోపాటు రైతులకు మాండూస్ తుఫాన్ పంట నష్ట పరిహాంర చెల్లించాం. కాకి లెక్కలతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ చేస్తానని రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో కరువు విలయతాండవం చేస్తోంది. మా ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించే అవసరం లేదు. చంద్రబాబు హయాంలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు’ అని పేర్కొన్నారు.
సీఎం జగన్ సవాల్‌ను స్వీకరించే దమ్ముందా?
‘సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. సీఎం జగన్ సవాల్‌ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా?, 175కి 175 స్థానాల్లో చంద్రబాబు పోటీ చేస్తారా?, చంద్రబాబు దుర్మార్గుడని ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబుకు నీతి, నిజాయితీ లేదు. చంద్రబాబు ప్రతీరోజూ నాలుక మార్చుకుని మాట్లాడుతున్నాడు. మేం నిజాలు చెప్తుంటే తట్టుకోలే కుక్కలతో మొరిగిస్తున్నాడు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే లోకేష్ యాత్రకు పక్క రాష్ట్రాల నుంచి జనాల్ని తీసుకొస్తున్నారు’ అని కాకాణి విమర్శించారు.