YSRCP Minister Jogi Ramesh Serious Comments On Nara Lokesh Padayatra, Details Inside - Sakshi
Sakshi News home page

‘నీదొక పాదయాత్ర.. నువ్వొక లీడర్‌వి’

Feb 17 2023 5:45 PM | Updated on Feb 17 2023 8:00 PM

Minister Jogi Rames Takes On Nara Lokesh - Sakshi

తాడేపల్లి:  డైరెక్ట్‌గా పోటీ చేస్తే వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవని నారా లోకేష్‌.. దొడ్డిదారిన మంత్రి అయిన విషయం గుర్తుంచుకుంటే బాగుంటుందని మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. ప్రస్తుతం లోకేష్‌ చేస్తున్న యాత్ర పాదయాత్ర కాదని, పనికిమాలిన యాత్ర అని దుయ్యబట్టారు మంత్రి జోగి రమేష్‌.  శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మాట్లాడిన జోగి రమేష్‌.. చంద్రబాబు, నారా లోకేష్‌పై ధ్వజమెత్తారు.

‘చంద్రబాబు, లోకేష్‌ వీది రౌడీల్లా తయారయ్యారు. లోకేష్‌ది పాదయాత్ర కాదు.. పనికిమాలిన యాత్ర. సీఎంను పట్టుకుని ఇష్టానుసారంమాట్లాడతారా. రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. వార్డు మెంబర్‌గా గెలవలేని లోకేష్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. లోకేష్‌ డబ్బుంటే సరిపోదు.. ఖలేజా ఉండాలి. చంద్రబాబే రాష్ట్రంలో పెద్దసైకో. భయం అంటే తెలియని వ్యక్తి సీఎం జగన్‌. ఢిల్లీ కోటను గజగజలాడించిన దమ్మున్న మొనగాడు జగన్‌.  దమ్మున్న నాయకుడికి ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్‌ జగన్‌’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement