
మీడియాతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో మహేశ్వర్‌రెడ్డి, లక్ష్మణ్, జితేందర్‌రెడ్డి, రాణిరుద్రమ
సాక్షి , హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్రంలో మూడో సారి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచన ప్రజల్లో ఉందన్నారు. ఈనెల 20 నుంచి బీజేపీ చేపట్టనున్న విజయ సంకల్పయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం ఆయన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ , మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీకి సానుకూల వాతావ రణం కనపడుతోందన్నారు. కేంద్రంలో ఏర్పాట య్యే నరేంద్రమోదీ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు భాగస్వామ్యమయ్యేలా, ప్రజల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ రాష్ట్రశాఖ 5 బస్సు యాత్రలు నిర్వహిస్తుందన్నారు.
కాంగ్రెస్–బీజేపీ మధ్యనే పోటీ
ఈసారి హైదరాబాద్ ఎంపీ సీటును బీజేపీనే కైవసం చేసుకుంటుందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. నరేంద్రమోదీకి ఎదురు నిలబడే శక్తి ఏ కూటమికి లేదని, ఖమ్మం, నల్లగొండ ప్రాంతాల నుంచి కూడా మోదీకి 80 శాతం మంది ప్రజలు అండగా నిలుస్తున్నారన్నారు. ఈ సమా వేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షు రాలు శిల్పారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణిరుద్రమ తదితరులు పాల్గొన్నారు.
ఐదు యాత్రలు ఇలా...
విజయ సంకల్ప యాత్ర పేరుతో ఫిబ్రవరి 20వ తేదీన ఐదు బస్సు యాత్రలు ప్రారంభమై మార్చి 1వ తేదీ వరకు కొనసాగుతాయని కిషన్‌రెడ్డి చెప్పారు.
► మొదటిది కొమురం భీం యాత్ర కాగా.. ఇది ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్‌లలో
► శాతవాహన యాత్ర కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల సెగ్మెంట్‌లలో
► కాకతీయయాత్ర ఖమ్మం, వరంగల్, మహ బూబాబాద్‌లలో
► భాగ్యనగర యాత్ర భువనగిరి, హైదరాబా ద్, సికింద్రాబాద్, మల్కాజిగిరిలలో
►కృష్ణమ్మ యాత్ర మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ ఎంపీ సెగ్మెంట్‌లలో ఉంటుందని, ఈ ఐదు యాత్రలు భాగ్య నగరంలో కలిసేవిధంగా ప్రణాళిక రూపొందించినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు.