రేవంత్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు | Komatireddy Raj Gopal Reddy Sensational Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published Mon, Dec 19 2022 12:42 AM | Last Updated on Mon, Dec 19 2022 12:45 AM

Komatireddy Raj Gopal Reddy Sensational Comments On Revanth Reddy - Sakshi

చండూరు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌ మెయిలర్, బ్రోకర్‌ అని కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు ఇప్పు­డు ప్రెస్‌మీట్‌ పెట్టి చెబుతున్నారని, ఇదే విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నా­రు. నల్లగొండ జిల్లా చండూరులో ఆదివారం విలేక­రుల సమావేశంలో ఆయన మాట్లాడు­తూ.. రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేయడం కంటే రాజకీయం వదిలివేయడం మంచిదని, ప్రజా సమస్యలపై కొట్లాడిన చరిత్ర రేవంత్‌ రెడ్డికి లేదని తెలిపారు. 

తెలుగుదేశం పార్టీ మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుందని తాను ఆరోజే చెప్పానని, నీతి నిజాయితీ పరిపాలన రావాలంటే బీజేపీకే సాధ్యమని చెబుతూ వచ్చానని గుర్తు చేశారు. రేవంత్‌ రెడ్డి నాయక­త్వంలో పనిచేయడం మంచిదా లేక మోదీ నాయకత్వంలో పని­చేయడం బాగుంటుందో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు గుండెమీద చేయి వేసుకుని చెప్పాలని కోరారు. మునుగోడును దత్తత తీసుకుంటానని చండూరు పట్టణంలో మంత్రి కేటీఆర్‌ చెప్పారని, అవేమాట­లు నమ్మి ప్రజలు అధికార పార్టీకి ఓటేసి గెలిపించారు కానీ నెలన్నర కావొస్తున్నా ఇప్పటివరకు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా మొదలు కాలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల లోపు మీరు ఇచ్చిన హామీ­లకు సంబంధించిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేతిలో బందీ అయిందని, ఆ కుటుంబ పాలనకు­వ్యతిరేకంగా పోరాడి మోదీ నాయ­కత్వంలో పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని కాంగ్రెస్‌ నేతలకు పిలుపునిచ్చారు.
     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement