వారికి చలో నల్గొండ సభ ఒక హెచ్చరిక: కేసీఆర్‌ | KCR Speech In BRS Chalo Nalgonda Sabha | Sakshi
Sakshi News home page

వారికి చలో నల్గొండ సభ ఒక హెచ్చరిక: కేసీఆర్‌

Feb 13 2024 5:51 PM | Updated on Feb 13 2024 6:42 PM

KCR Speech In BRS Chalo Nalgonda Sabha - Sakshi

సాక్షి, నల్గొండ: చలో నల్గొండ సభ.. ఉద్యమ సభ, పోరాట సభ.. రాజకీయ సభ కాదని మాజీ సీఎం కే. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కృష్ణా నీళ్ల మీద మన హక్కు అనేది.. మనందరి బతుకులకు చావో రేవో తేల్చే సమస్య అని పేర్కొన్నారు కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ తలపెట్టిన ‘చలో నల్లగొండ’ బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్‌  ప్రసంగిస్తూ.. ఈ రోజు నల్గొండలో ‘చలో నల్గొండ’ కార్యక్రమం చేపట్టాం. కారణం  ఏంటి? ఎందుకు ఈ సభ పెట్టాల్సి వచ్చింది. నాకు కాలు విరిగినా ఎందుకు రావాల్సి వచ్చానో? తెలుసుకోవాలని అ‍న్నారు. ఈ రోజు చలో నల్గొండ కార్యక్రమం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొందరికి ఇది రాజకీయం. కానీ.. ఇది ఉద్యమ సభ.. పోరాట సభ అని రాజకీయ సభ కాదని తెలిపారు.

కృష్ణా నీళ్లమీద మన హక్కు అనేది.. మనందరి బతుకులకు చావో రేవో తేల్చే సమస్య అని తెలిపారు. ఈ మాట తాను తెలంగాణలో పక్షిలాగా తిరుగుతూ చెప్పవట్టి 24 ఏళ్లు అయిందని తెలిపారు. కృష్ణా కావోచ్చు.. అటు గోదావరి కావోచ్చు. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు. ఇదే నల్గొండలో నీళ్లు లేకపోతే ప్రజల బతుకులు వంగిపోయాయి. లక్షా యాబై వేల మంది మునుగోడు, దేవరకొండ ఇరత ప్రాంతాల్లో బిడ్డల నడుములు ఫ్లోరైడ్‌తో వంగిపోయాయి. చివరికి ఈ జిల్లాలో ఉద్యమకారలంతా కలిసి ఫ్లోరైడ్‌ ఎఫెక్ట్‌ అయిన బిడ్డలను తీసుకెళ్లి ప్రధానమంత్రి టెబుల్‌పై పడుకోబెట్టి.. అయ్యా మా బతుకు ఇది అంటే పట్టించుకున్నవారు లేరు. ఆనాడు పార్టీలు లేవా.. మంత్రులు లేరా? ఎవరు పట్టించుకోలే.

నల్గొండలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక జీరో ఫ్లోరైడ్‌గా చేశాం. ప్రజలను అడిగితే చెబుతున్నారు. మిషన్‌ భగీరత నీళ్లతో తమకు బాధలు లేవని చెబుతున్నారు. ఏడాడు ఏ నాయకుడు పటట్టించుకోలే. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఈ సభ పెట్టింది ఎందుకు? కొంత మంది​ సన్నాసులు తెలివి లేక వాళ్లకు వ్యతిరేకం అనుకుంటున్నారు. తాను ఒక్కటే మాటలో జరగవల్సింది చెబుతా.. ఉవ్వెత్తున మనం ఎగిసిపడకపోతే.. మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే.. ఎవరూ కూడా మన రక్షణకు రారు. ఈ మాట రాసి పెటట్టుకోండి. ఆనాడు ఫ్లోరైడ్‌ సమయంలో ఎవరూ రాలేదు.

ఓట్లు ఉన్నప్పుడు వస్తారు కబుర్లు చెప్పడానికి కానీ, తర్వాత ఎవరూ రారు. ఓటు గుద్దినం గడ్డకు ఎక్కిర్రు అంటే మన వీపులో గుద్ది బొందలోకి నెట్టిర్రు తప్పితే ఎవరూ రాలే. ఇది జరిగిన చరిత్ర.. ఇప్పుడు జరుగుతున్న చరిత్ర.. దయచేసి మీరు గనించాలి. ఇది చిల్లరమల్లర రాజకీయ సభకాదు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర నాయకులకు, బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యూనల్‌, కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రికి గాని మన నీళ్లు దొబ్బి పోదామనుకునే స్వార్థ శక్తులకు గాని.. ఈ చలో నల్గొండ సభ ఒక హెచ్చరిక  అని మండిపడ్డారు.

మాజీ సీఎం కేసీఆర్‌ ఇంకా ఏమన్నారంటే..

  • ఖమ్మం, నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజల జీవన్మరణ సమస్య ఇది
  • పదేళ్ళ పాటు ఎలాంటి సమస్యలు లేకుండా పాలన చేసిన 
  • ఆముదాలు పండే నల్లగొండలో లక్షల టన్నుల వరి పండేలా చేశా
  • పక్కన కృష్ణమ్మ ఉన్నా ఫలితమేమి లేకపాయే అనే పాట నేనే రాశా
  • పాలమూరు ఎత్తపోతల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు
  • ఆనాడు కాంగ్రెస్ సంవత్సర కాలానికి మాత్రమే నీళ్ల సర్దుబాటు చేసుకోండంటే తెలంగాణ రావాలని ఒప్పుకున్నాం
  • నీళ్ల పంపిణీ చేయాలని మోదీ ప్రభుత్వం వచ్చాక వందల‌ ఉత్తరాలు రాశాం
  • సుప్రీంకోర్టుకు కూడా వెళ్లినాం
  • ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లోక్ సభలో కూడా ఆందోళన చేశాం
  • ఏ ప్రభుత్వం ఉన్నా మనకు రావాల్సిన వాటా కోసం కొట్లాడాలి
  • పాలిచ్చే బర్రెను వదిలేసి దున్నపోతును తెచ్చుకున్నారు
  • ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుందని ఉత్తమ్ సోయిలేకుండా అంటున్నారు
  •  తెలంగాణకు అన్యాయం జరిగితే నా కట్టె కాలే వరకు పులిలా కొట్లాడుతా
  • నేను ఛలో నల్లగొండకు పిలుపునిస్తే అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. 
  • ఆ తీర్మానం కూడా సరిగా లేదు
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేసీఆర్ని తిట్టాలనే తపన తప్ప ఇంకొకటి లేదు
  • ఎవరికీ అధికారం శాశ్వతం కాదు.. తెలంగాణ హక్కులు మాత్రమే శాశ్వతం
  • కేసీఆర్ ప్రభుత్వం పోగానే కరెంట్ కట్ అవుద్దా... దద్దమ్మలు, చవటల రాజ్యం ఉంటే అలానే ఉంటుంది. 
  • కరెంటుకు, నీళ్లకు తిప్పలపెడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం
  • అసెంబ్లీలో జనరేటర్లు పెట్టారు. 
  • ఒకనాడు ఏడ్చిన తెలంగాణలో మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించాం
  • రైతు బంధు కూడా ఇవ్వరా.. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతాం అంటారా.. కళ్లు నెత్తికెక్కినయా
  • పంటలు పండించే రైతులకు కూడా చెప్పులుంటాయి
  • రైతు చెప్పుతో కొడితే మూడు పళ్లు ఊడుతాయి
  • కేసీఆర్ను నల్లగొండలో తిరగనీయం అంటున్నారు. దమ్ముందా సంపుతరా?
  • కేసీఆర్‌ని చంపి మీరుంటరా?
  • పాలమూరు, సీతారామ ఎత్తిపోతలు, గురుకులాల ఏర్పాటు, కరెంట్ సరఫరా, మంచినీళ్ల సరఫరా సరిగా ఇవ్వాలనేది లేదు
  • మేడిగడ్డ కాడ తోకమట్ట ఉందా... ఏం పీకుతరు..
  • అసెంబ్లీ అయిపోయాక మేం కూడా మేడిగడ్డకు పోతాం 
  • దమ్ముంటే నీళ్లు ఎత్తిపోయ్యాలి
  • సాగర్ కుంగిపోలేదా, కడెం గేటు కొట్టుకుపోలేదా, మూసి గేట్లు సరిగా ఉండేనా
  • డబుల్ స్పీడ్‌తో మేం మళ్లీ అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం ఇలానే మాట్లాడాలా
  • నది నీళ్లపై నీకు అవగాహన లేదు. నన్ను అడిగితే నేను చెప్పకపోయేవాడినా
  • బ్రిజేష్ ట్రిబ్యునల్లో మన వాటా తేలే వరకు పోరాటానికి ఐదు జిల్లాల ప్రజలు సిద్ధంగా ఉండాలి
  • చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా నాకు బాధ్యత ఉంటది
  • అసెంబ్లీలో జనరేటర్ పెట్టిన  ఘనులు కరెంట్ ఇస్తారా
  • మళ్లీ మనమే వస్తాం. తెలంగాణకు ఏం కానివ్వను
  • వరికి కనీస మద్దతు ధర ఇస్తే బోనస్ ఇవ్వరట
  • కృష్ణా, గోదావరిలో రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం బీఆర్ఎస్ కొట్లాడుతది. 
  • నీళ్ల వాటా విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. 
  • ప్రాజెక్టులను అప్పగించాలని నన్ను కూడా బెదిరించారు. అయినా వినలేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement