హుజూరాబాద్‌లో నైతిక విజయం నాదే: గెల్లు శ్రీనివాస్‌ | Sakshi
Sakshi News home page

Huzurabad Bypoll Result: హుజూరాబాద్‌లో నైతిక విజయం నాదే: గెల్లు శ్రీనివాస్‌

Published Tue, Nov 2 2021 7:22 PM

Huzurabad Bypoll 2021 Result TRS Gellu Srinivas Comments - Sakshi

సాక్షి, కరీంగనర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితంపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ స్పందించారు. హుజూరాబాద్‌లో నైతిక విజయం తనదే అన్నారు. ఈ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు.. విద్యార్థి నాయకుడు వెంకట్‌ని బలిపశువును చేశాయని గెల్లు శ్రీనివాస్‌ ఆగ్రహం వ్య​క్తం చేశారు. హుజూరాబాద్‌ ఫలితంపై కేటీఆర్‌, హరీశ్‌రావు కూడా స్పందించారు.
(చదవండి: హుజూరాబాద్‌లో ఓటమి.. వైరలవుతోన్న కేటీఆర్‌ ట్వీట్‌)

ఇక హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ 24వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెల్లు శ్రీనివాస్‌పై విజయం సాధించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ కేవలం 3000పైచిలుకు ఓట్లకే పరిమితం అయ్యింది. 

చదవండి: Huzurabad Bypoll Results: ‍బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కు: హరీశ్‌ రావు

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement