2019 ఎగ్జిట్‌ పోల్స్‌ ఎంతవరకూ నిజమయ్యాయి? యూపీలో ఏం జరిగింది? | How Accurate Exit Polls 2019 | Sakshi
Sakshi News home page

2019 ఎగ్జిట్‌ పోల్స్‌ ఎంతవరకూ నిజమయ్యాయి? యూపీలో ఏం జరిగింది?

Jun 1 2024 11:37 AM | Updated on Jun 1 2024 12:19 PM

How Accurate Exit Polls 2019

ఏడు దశల లోక్‌సభ ఎన్నికలు ఈరోజుతో ముగియనున్నాయి. ఆ తర్వాత అందరి దృష్టి ఫలితాలపైనే ఉండనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే దీనికి ముందు జూన్  ఒకటిన చివరి దశ ఓటింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్స్‌ వెలువడనున్నాయి.

పలు ఏజెన్సీలు తమ అధ్యయనాల ఆధారంగా ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్‌ ఎంత వరకూ నిజమయ్యాయో  ఇప్పుడు చూద్దాం. 2019 ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని స్పష్టంగా వెల్లడయ్యింది. ఫలితాల్లో కూడా అదే జరిగింది. 2019లో మొత్తం 543 సీట్లకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 352 సీట్లు దక్కించుకుంది. ఒక్క బీజేపీనే రికార్డు స్థాయిలో 303 సీట్లు దక్కించుకుంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ 90 సీట్లు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లకు గాను ఎన్డీఏ 49 సీట్లను గెలుచుకుంటుందనే అంచనాలు ఎగ్జిట్‌ పోల్స్‌లో వెలువడ్డాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో యూపీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 64 సీట్లు గెలుచుకుంది. రాయ్‌బరేలీ సీటు ఎస్పీకి దక్కింది. 10 సీట్లు బీఎస్పీ, కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి.

ఎగ్జిట్ పోల్స్‌లో ఎస్పీ-బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీలకు 29 సీట్లు వస్తాయని అంచనాలున్నాయి. ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్‌కు కేవలం రెండు సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 73 స్థానాలను గెలుచుకుంది. వాటిలో 71 బీజేపీకి, రెండు అప్నాదళ్‌కు దక్కాయి. ఈసారి ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ, ఆర్‌ఎల్‌ఏడీ కలిసి పోటీ చేశాయి. యూపీలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఈ కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement