
శేరీలింగంపల్లి నియోజకవర్గం
శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన అరికపూడి గాందీ రెండోసారి విజయం సాదించారు. ఆయన తన సమీప టిడిపి ప్రత్యర్ది భవ్య ఆనంద్ పై 44194 ఓట్ల మెజార్టీతో గెలిచారు.గాందీ 2014లో టిడిపి,బిజెపి కూటమిలో భాగంగా టిడిపి అభ్యర్దిగా పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత కాలంలో ఆయన అదికార టిఆర్‌ఎస్ లో చేరిపోయారు.2018లో టిఆర్‌ఎస్ పక్షాన పోటీచేసి గెలవగలిగారు.
గాంధీకి 143005 ఓట్లు రాగా, ఆనంద్ కు 98811 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన జి.యోగానంద్ కు 22 వేలకు పైగా ఓట్లు వచ్చి,మూడోస్థానంలో నిలిచారు. గాందీ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. శేరిలింగంపల్లిలో 2014లో టిడిపి అభ్యర్ధిగా అరికపూడి గాందీ 75904 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.శేరీలింగంపల్లిలో ఒకసారి బిసి యాదవ్ వర్గానికి చెందిన వ్యక్తి గెలవగా, రెండుసార్లు కమ్మ సామాజికవర్గం నేత గెలుపొందారు.
శేరీలింగంపల్లి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..