ఒక వైపు నామినేషన్లు.. మరోవైపు రాజీనామాలు

Former Punjab MLA Jasbir Singh Khangura Resigns From Congress - Sakshi

చండీగఢ్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పంజాబ్​ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఒక వైపు  కాంగ్రెస్​ అభ్యర్థులు ఆయా స్థానాల నుంచి నామినేషన్లు దాఖలు చేస్తున్న తరుణంలో.. మరోవైపు రాజీనామాల పర్వం తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తుంది.  తాజాగా, ఖిల్లా రాయ్​పూర్​కు చెందిన మాజీ ఎమ్మెల్యే జస్బిర్​ సింగ్ ఖాన్​గుర కాంగ్రెస్ పార్టీకి గుడ్​బాయ్​ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్​ వేదికగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తన రాజీనామా సమర్పించారు.

తన లేఖలో కాంగ్రెస్​ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను.. 20 ఏళ్లపాటు కాంగ్రెస్​కు సేవచేసినట్లు తెలిపారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారో మాత్రం ప్రకటించలేదు. కాగా, జస్బిర్​ సింగ్.. తండ్రి జగ్​పాల్​ కూడా కాంగ్రెస్​కు చెందిన సీనియర్​ నాయకుడు. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి మంత్రుల నుంచి స్థానిక నాయకుల వరకు వలసలు ఊపందుకున్నాయి.

ఇప్పటికే పంజాబ్​ పీసీసీ చీఫ్​ నవజ్యోత్​ సింగ్​ నామినేషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, రాహుల్​గాంధీ పంజాబ్​టూర్​లో సీఎం చన్నీ, నవజ్యోత్​ సింగ్​ సిద్ధూల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపే ప్రయత్నం చేశారు.

అదే వేదికలో చన్నీ, సిద్దూ.. ఇరువురు నాయకులు సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన మరొకరు వారికి.. మద్దతు పలుకుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మరికొన్ని రోజుల్లో సీఎం అభ్యర్థి ఉత్కంఠకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్​లో ఫిబ్రవరి 20 నుంచి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. మార్చి 10 న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

చదవండి: గత 2 నెలలుగా బాలికను వినోద్​జైన్ లైంగికంగా​ వేధించాడు: ఏసీపీ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top