Kuppam Municipal Election Results 2021: Chandrababu Silent On Kuppam Results - Sakshi
Sakshi News home page

కుప్పం ఓటమిపై సైలెంట్‌.. హైదరాబాద్‌కు చంద్రబాబు

Nov 18 2021 3:45 AM | Updated on Nov 18 2021 9:03 AM

Chandrababu Silent On Kuppam Defeat - Sakshi

Kuppam Municipal Election Results 2021: మునిసిపల్‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిన వేళ చంద్రబాబు ఉండవల్లి నుంచి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు నుంచి ఉండవల్లిలోనే ఉన్న ఆయన ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ వెళ్లడం ఆసక్తికరంగా మారింది. తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడిపోవడంతో ఆయన కొంత అసహనంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మునిసిపల్‌ ఎన్నికల ఫలితాలు టీడీపీకి పూర్తి వ్యతిరేకంగా రావడంతో ఆయన వాటిపై స్పందించలేదు. కుప్పం మునిసిపాలిటీలో గెలిస్తే మీడియాతో మాట్లాడాలని భావించినట్లు సమాచారం. కానీ అక్కడ చిత్తుగా ఓడిపోవడంతో స్పందించేందుకు ఇష్టపడలేదు. మౌనంగా ఉండవల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. కొండపల్లి మునిసిపాలిటీ 10వ వార్డులో గెలిచిన స్వతంత్ర అభ్యర్థిని శ్రీలక్ష్మికి గన్నవరం ఎయిర్‌పోర్టులో చంద్రబాబు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement