ఏపీలో రేపటి నుంచి సీఈసీ పర్యటన | Sakshi
Sakshi News home page

ఏపీలో రేపటి నుంచి సీఈసీ పర్యటన

Published Sun, Jan 7 2024 4:54 PM

CEC And ECs To Visit AP To Review Preparations - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌ పర్యటించనుంది. ఎ​న్నికల అధికారుల బృందం రేపు(సోమవారం) విజయవాడ చేరుకోనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు రాష్ట్రానికి రానున్నారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం ఎల్లుండి(మంగళవారం) పార్టీలతో భేటీ అవుతారు. ఓటర్ల జాబితాలో తప్పులు, ఫిర్యాదులపై రాష్ట్ర సీఈవోతో సమీక్ష నిర్వహిస్తారు. జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష చేస్తారు. 

ఎన్నికల సన్నద్ధతపై ఈనెల 10న సీఈవో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎన్నికల కమిషన్‌.. కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులతో భేటీ అవుతుంది. ఈనెల 10న సాయత్రం 4.30 గంటలకు సీఈసీ, కమిషనర్ల మీడియా సమావేశం జరగనుంది. మీడియా సమావేశం అనంతరం సీఈసీ, ఎన్నికల కమిషనర్ల బృందం​ ఢిల్లీ వెళ్లనుంది.

చదవండి: ‘నా ఉద్యోగం నేను చేసుకుంటా..’

Advertisement
 
Advertisement
 
Advertisement