బీజేపీ మేనిఫెస్టో కమిటీ.. లిస్ట్ రిలీజ్ చేసిన జేపీ నడ్డా | Sakshi
Sakshi News home page

బీజేపీ మేనిఫెస్టో కమిటీ.. లిస్ట్ రిలీజ్ చేసిన జేపీ నడ్డా

Published Sat, Mar 30 2024 4:25 PM

BJP Election Manifesto Committee List For Lok Sabha Elections 2024 - Sakshi

ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దేశంలోని అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన జాబితా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

బీజేపీ మూడవసారి అధికారంలోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టో ప్యానెల్ కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నియమించగా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కో-కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. 27 మంది సభ్యుల ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా తదితరులు సభ్యులుగా ఉన్నారు.

ఈ జాబితాలో అర్జున్ రామ్ మేఘ్వాల్, భూపేందర్ యాదవ్, విష్ణు దేవ్ సాయి, భూపేందర్ పటేల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మోహన్ యాదవ్, వసుంధర రాజే, రవిశంకర్ ప్రసాద్‌లు ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

Advertisement
 
Advertisement