తెలంగాణ బీజేపీ చీఫ్‌ ఎవరు?.. వారిద్దరి వ్యాఖ్యల మర్మమేంటి? | Big Suspense Over Telangana BJP State Chief Post | Sakshi
Sakshi News home page

తెలంగాణ బీజేపీ చీఫ్‌ ఎవరు?.. వారిద్దరి వ్యాఖ్యల మర్మమేంటి?

Published Sat, Jun 22 2024 10:07 AM | Last Updated on Sat, Jun 22 2024 10:41 AM

Big Suspense Over Telangana BJP State Chief Post

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీలో పార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష స్థానం పార్టీలో కల్లోలం సృష్టిస్తోంది. పార్టీ అధ్యక్ష స్థానంపై పలువురు నేతలు ఫోకస్‌ పెట్టడంతో కమలం పార్టీలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది.

కాగా, పార్టీ చీఫ్‌ స్థానం కోసం కాషాయ పార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్‌.. పార్టీలో కొత్త నీరు, కొత్త శక్తి అవసరం అంటూ కామెంట్స్‌ చేశారు. అనంతరం.. దేశం, ధర్మం, పార్టీపై భక్తి ఉన్న వారికే పగ్గాలు ఇవ్వాలని రాజా సింగ్‌ అంటున్నారు. అలాగే, అందరి సలహాలు తీసుకున్న తర్వాతే హైకమాండ్‌ ప్రకటన చేయాలని రాజాసింగ్‌ సూచించారు. దీంతో, ఇద్దరి నేతలు వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

మరోవైపు.. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎంపీ డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌, రఘునందన్ కూడా పోటీ నిలుస్తున్నారు. ఇక, వారితో పాటుగా ఎమ్మెల్యేలు వెంకటరమణా రెడ్డి, పాయల్‌ శంకర్‌ కూడా రేసులోకి వచ్చారు. అటు సీనియర్‌ నేతలు మురళీధర్‌ రావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావు వంటి నేతలు కూడా హైకమాండ్‌ వద్ద లాబీయింగ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా పార్టీ చీఫ్‌ పోస్టు కమలం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement