క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయం: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

AP:Chief Whip Srikanth Reddy Fires On Chandrababu Over Casino - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: టీడీపీ అధినేత చంద్రబాబు సీనియారిటీతో దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు క్యాసినో పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం కడపలో శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి అయిపోయి పదిరోజులైనా జూదం, క్యాసినోలని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూదాన్ని ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు.

చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి అయిన తరువాతే హైదరాబాద్‌లో నైట్‌ లైఫ్‌ కల్చర్‌ ఏర్పాటు చేశానని చెప్పారని గుర్తు చేశారు. డిస్కోలు, బార్‌లు, పబ్‌లు, క్యాసినోలే నైట్‌ లైఫ్‌ అన్నారు. నైట్‌ లైఫ్‌ ఉంటేనే మనకు పరిశ్రమలు వస్తాయని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ ప్రభుత్వంపై చంద్రబాబు కవాలనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు.   ఇదే చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ప్రజల సంతోషాన్ని కాలరాస్తున్నారు అని మాట్లాడే వాడని విమర్శించారు.

‘ఉద్యోగులు టీడీపీ హయాంలో సంఘాలు ఏర్పాటు చేసుకుంటే..చంద్రబాబు ఈ సంఘాల అంతు చూస్తా..తోకలు కత్తరిస్తానని బెదిరించాడు. ఈ రోజు సంఘాలన్ని ఏకతాటిపైకి రండి అని పిలుపునిస్తున్నారు. ఈ రోజురాష్ట్రంలో ప్రెండ్లీ ప్రభుత్వం ఉంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందామని ప్రభుత్వం కోరుతోంది. కరోనా లేని సమయంలో ఉద్యోగులు అడగకపోయినా కూడా వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ఐఆర్‌ 27 శాతం ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఐదు డీఏలు ఇస్తే వెసులుబాటు ఉంటుందని ఇలా చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ఇస్తున్న రూ.10 వేల కోట్ల భారం ఎక్కడికి వెళ్తుంది. ప్రభుత్వానికి భారమైన ఉద్యోగుల సంక్షేమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆలోచిస్తున్నారని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top