పవన్‌ కల్యాణ్‌పై ప్రజలకు పూర్తి క్లారిటీ ఉంది: హోంమంత్రి సుచరిత

AP Home Minister Mekathoti Sucharitha Strong Counter To Pawan kalyan - Sakshi

సాక్షి,  గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియని పరిస్థితి ఉందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. పవన్‌ మాట్లాడే భాష ఎలా ఉందో ఒకసారి ఆయనే ఆలోచించుకోవాలని హితవు పలికారు. పవన్ కల్యాణ్ తోలు తీస్తాను అంటున్నారని, తోలు తీయించుకోవడానికి ఎవరు రెడీగా ఉంటారని వ్యంగ్యంగా విమర్శించారు. ఆయన రెండు స్థానాల్లో నిలబడితే ప్రజలు రెండు చోట్లా తిరస్కరించారని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎన్ని చోట్ల నిలబడతారో, ఆయన్ను అంగీకరిస్తారో లేదో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
చదవండి: బద్వేల్ ఉప ఎన్నికపై సీఎం జగన్‌ ప్రత్యేక సమావేశం

ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనకు వచ్చిన ఒకటి, రెండు సీట్లు కలుపుకొని రెండు పార్టీలు ఎంపీపీ పదవులు ఎలా పంచుకున్నారో అందరికీ తెలుసని హోంమంత్రి ఎద్దేవా చేశారు.  జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయని అక్కడే అర్థమైపోతుందని దుయ్యబట్టారు. ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారని, పవన్‌ నిలకడలేని వ్యక్తి అని ఆయన మాటల్లోనే అర్థమవుతుందన్నారు. ఒకసారి లెఫ్టిస్టు అంటాడు,  మరోసారి బీజేపీతో చేతులు కలుపుతాడు, ఇంకోసారి టీడీపీతో వెళ్తాడని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ పట్ల ప్రజలకు పూర్తి క్లారిటీ ఉందని ఈ సందర్భంగా సుచరిత పేర్కొన్నారు.
చదవండి: ‘పవన్‌ ఆ సమయంలో మందు కొట్టి పడుకున్నారా?’: పిఠాపురం ఎమ్మెల్యే

తమ పాలన ఎలా ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తీర్పు ద్వారా అర్థమవుతుందన్నారు. అధికారంలోకి రావాలంటే పార్టీ విధి విధానాన్ని ప్రజలకు  చెప్పాలని అన్నారు.  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పి అధికారంలోకి వచ్చారని సుచరిత గుర్తు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top