మేమొస్తే బెంగాల్‌లో పారిశ్రామికీకరణ

Amit Shah holds road show in Singur, assures industrialisation - Sakshi

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీ

రాష్ట్రంలో 200 పైగా సీట్లు గెలుస్తాం 

రిక్షావాలా ఇంట్లో షా భోజనం

సింగూరు/హౌరా/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వేగంగా పారిశ్రామికీకరణ చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సింగూరులో భారీ రోడ్‌ షో నిర్వహించారు. భూసేకరణకు వ్యతిరేకంగా గతంలో తీవ్రస్థాయిలో పోరాటం జరిగిన ఇదే ప్రాంతంలో అమిత్‌ షా పారిశ్రామికీకరణ హామీ ఇవ్వడం విశేషం.

తాము అధికారంలోకి రాగానే సింగూరులో చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని, బంగాళదుంప రైతులను ఆదుకోవడానికి రూ.500 కోట్లతో ప్రత్యేక నిధిని నెలకొల్పుతామని బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించామని గుర్తుచేశారు. రోడ్‌ షో సందర్భంగా అమిత్‌ షా మీడియాతో మాట్లాడారు. తాము
ద్వేష రాజకీయాలు కాదు, అభివృద్ధి రాజకీయాలు చేస్తామన్నారు.

దీదీ చాలా ఆలస్యం చేశారు
బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సభల్లో హిందూ దేవుళ్లను పూజించడం, చండీ స్తోత్రాలు పారాయణం చేయడాన్ని అమిత్‌ షా స్వగతించారు. అయితే, ఆమె ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను బీజేపీ 200కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని పునరుద్ఘాటించారు. సింగూరులో బీజేపీ అభ్యర్థిగా రవీంద్రనాథ్‌ భట్టాచార్య(89) పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈసారి టికెట్‌ నిరాకరించడంతో బీజేపీలో చేరారు.

మొదటి 3 దశల్లో 63–68 సీట్లు గెలుస్తాం
బెంగాల్‌లో ఇప్పటివరకు మూడు దశల శాసనసభ ఎన్నికలు పూర్తయ్యాయి. 91 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, వీటిలో 63 నుంచి 68 స్థానాలను తాము దక్కించుకోవడం తథ్యమని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీలపై భారీ ఆధిక్యత సాధిస్తామని అన్నారు. మిగిలిన ఐదు దశల ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. 200కు పైగా సీట్లు సాధించాలన్న లక్ష్యాన్ని ఛేదిస్తామని వ్యాఖ్యానించారు. ఆయన హౌరా జిల్లాలోని దోంజూర్‌ నియోజకవర్గంలో ఒక రిక్షా కార్మికుడి ఇంట్లో బుధవారం మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

రిక్షావాలా ఇంట్లో అమిత్‌ షా కింద కూర్చొని పప్పు కూరతో అన్నం తిన్నారు. అంతకుముందు దోంజూర్‌లో రోడ్‌ షోలో పాల్గొన్నారు. మల్లిఖ్‌ ఫటాక్‌లోనూ రోడ్‌ షో నిర్వహించారు. మమతా బెనర్జీ పెద్ద నాయకురాలని, పెద్ద సీట్ల తేడాతోనే ఆమె ఓడిపోతారని అమిత్‌ షా జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రౌడీయిజాన్ని అంతం చేస్తామని హామీ ఇచ్చారు. అక్రమ వలసలను కఠినంగా అణచి వేస్తామని, సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేస్తామని వెల్లడించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో విద్యా వ్యవస్థను సంస్కరిస్తున్నామని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని, పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-04-2021
Apr 08, 2021, 11:47 IST
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో నాలుగో దశ ఎన్నిక ప్రచారం జోరందుకుంది. 10వ తేదీన పోలింగ్‌ జరుగనున్న 44...
08-04-2021
Apr 08, 2021, 03:07 IST
బనేశ్వర్‌: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదేశాలపై సీఆర్‌పీఎఫ్‌ దళాలు పశ్చిమబెంగాల్‌లో అరాచకం సృష్టిస్తున్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి,...
08-04-2021
Apr 08, 2021, 02:27 IST
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థిస్తున్నారన్న బీజేపీ ఫిర్యాదుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా...
07-04-2021
Apr 07, 2021, 01:49 IST
కల్చిని: బీజేపీకే ఓటేయాలంటూ కేంద్ర బలగాలు ఓటర్లను బెదిరిస్తున్నాయని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. మూడో దశ...
06-04-2021
Apr 06, 2021, 20:36 IST
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడం, రాష్ట్రంలో అధికార పార్టీపై స్టార్‌ హీరోలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
06-04-2021
Apr 06, 2021, 19:46 IST
ఒక్క పశ్చిమబెంగాల్‌ మినహా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు ముగింపు.
06-04-2021
Apr 06, 2021, 17:10 IST
4 ఈవీఎంలు, వీవీపాట్‌లను తీసుకుని తనకు బంధువు, స్థానిక టీఎంసీ నాయకుడు ఇంటికి వెళ్లాడు. రాత్రంతా అక్కడే ఉన్నాడు.
05-04-2021
Apr 06, 2021, 14:19 IST
పాపం ఆమెను రాజకీయాల నుంచి పంపించేశారు.. కనీసం ఓటు కూడా వేయకుండా చేశారని తమిళనాడులో చర్చ.
06-04-2021
Apr 06, 2021, 12:44 IST
కోల్‌కతా: ‘భయం కారణంగా బెంగాలీలెప్పుడూ తమ తలలను ఇతరుల ఎదుట వంచలేదు. బెంగాలీలను భయపెట్టి ఎవరూ ఇంతవరకు గెలవలేదు..’ అంటూ...
06-04-2021
Apr 06, 2021, 07:57 IST
లైవ్‌ అప్‌డేట్స్‌: ► నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమబెంగాల్‌, అసోం,...
06-04-2021
Apr 06, 2021, 06:45 IST
బెంగాల్‌ ఎన్నికల్లో ఒక నినాదం బలంగా వినిపిస్తోంది. ‘మీకు దీదీ కావాలా లాకెట్‌ కావాలా’ అని. దీదీ అంటే మమతా...
06-04-2021
Apr 06, 2021, 04:49 IST
కోల్‌కతా: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమబెంగాల్‌లోని టాలిగంజ్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ట్రామ్‌ డిపో వద్ద ప్రారంభమైన ర్యాలీ...
05-04-2021
Apr 05, 2021, 14:55 IST
సాక్షి, చెన్నై:  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున నగలు నగదు పట్టుబడింది. అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని గంటల్లో పప్రారంభం కానున్న...
05-04-2021
Apr 05, 2021, 09:03 IST
మీరు ఇటీవలే ఈమె ఫొటోను మన ‘ఫ్యామిలీ’లో చూసి ఉంటారు. ఈమె కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తొలి...
05-04-2021
Apr 05, 2021, 06:33 IST
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం 7 గంటలకు తెరపడింది. 
05-04-2021
Apr 05, 2021, 06:27 IST
సాక్షి ప్రతినిధి, చెన్నై: పదేళ్ల యూపీఏ పాలనలో తమిళనాడు ప్రజలకు డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి మేలు చేయకపోగా తీరని ద్రోహం చేసిందని...
05-04-2021
Apr 05, 2021, 04:01 IST
ఖనాకుల్‌/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మరో ఆరు దశల ఎన్నికలు జరగాల్సి ఉండగానే, బీజేపీ విజయం తథ్యమని ప్రధాని మోదీ చెప్పడం...
04-04-2021
Apr 04, 2021, 14:22 IST
సాక్షి, చెన్నై: విశ్వనటుడు కమల్‌ హాసన్‌ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.  ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై...
04-04-2021
Apr 04, 2021, 12:10 IST
సాక్షి, యానాం: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ బహిష్కృత నేత అదృశ్యం కలకలం రేపుతోంది. యానాం అసెంబ్లీ నియోజకవర్గం...
04-04-2021
Apr 04, 2021, 05:48 IST
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల వేళ ఒక ప్రముఖ చానెల్‌ సంచలనాత్మక విషయాన్ని బయటపెట్టింది. విచారణా సంస్థలకు సంబంధించిన వర్గాల...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top