జ్యోతినగర్: కార్మికుల శ్రమ దేశ సంపద సృష్టి కి మూలమని, సంస్థ అభివృద్ధిలో కార్మికుల శ్రమదానం ఎంతో గొప్పదని, శ్రమదానం చే సే వ్యక్తులు ఎల్లప్పుడూ ప్రతిఫలం పొందుతా రని రామగుండంలోని ఎన్టీపీసీ –తెలంగాణ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్ కుమార్ సామంత అన్నారు. శుక్రవారం మేడే సందర్భంగా పార్కులో జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులు ఉత్పాదకత పెంచాలని, హక్కుల గురించి అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఉద్యోగుల సంక్షేమం, సమ్మిళిత వృద్ధిపై ఎన్టీపీసీ దృష్టి సారిస్తుందని ఆ యన స్పష్టం చేశారు. విధి నిర్వహణలో కార్మి కులు తమ ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. కార్యక్రమంలో ఉన్న తాధికారులు, అధికారులు, ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులు, పలు సంఘాల నాయకు లు, ప్రతినిధులు, ఉద్యోగులు, కాంట్రాక్టు ఏజెన్సీల ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
పథకాలపై అవగాహన అవసరం
పెద్దపల్లి: కార్మిక సంక్షేమ పథకాలపై అవగాహన పెరగాలని అదనపు కలెక్టర్ వేణు అన్నా రు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన మే డేలో వేణు మాట్లాడారు. ప్రతీశాఖలోని ఉద్యోగులందరూ శ్రామికులేనని అన్నారు. శ్రామిక హ క్కులు, ప్రయోజనాలు పోరాటాల ద్వారానే సాధ్యమయ్యాయని తెలిపారు. కనీస వేతన చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, జిల్లాలోని సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఎన్‌టీపీసీ, కేశోరం వంటి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం అనంతరం మే డే పురస్కారాలను కార్మికులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక కమిషనర్ వెంకటరమణ, జిల్లా సహాయ కార్మిక అధికారి మొహమ్మద్ రఫీ, ఉపాధి కల్పనాధికారి రాజశేఖర్, బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డిపాల్గొన్నారు.
మోతాదు మించొద్దు
మంథనిరూరల్: పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడవద్దని, అలా వాడితే పంట లతోపాటు భూమికి నష్టం జరుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వ విద్యాలయ శాస్త్రవేత్తలు అరుణ్‌కుమార్, శ్రావణ్ అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చిన్నఓదాలలో రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. యూరియా వినియోగం తగ్గించాలని, అవసరానికి మించి పురుగులమందులు వాడితే దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. అనంతరం విశ్వవిద్యాలయం నుంచి రూపొందించిన వివిధ వరి రకాల వంగడాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగుల శారద, మండల వ్యవసాయ అధికారి నవ్య, ఏఈవో మురళి, పంచాయతీ సెక్రటరీతోపాటు రైతులు పాల్గొన్నారు.
బుద్ధుని బోధనలు ఆచరించాలి
జూలపల్లి/ఎలిగేడు: శాంతి, సామరస్యానికి బుద్ధుని బోధనలు ఎంతగానో ఉపయోగపడ తాయని బుద్ధ జయంతోత్సవ కమిటీ చైర్మన్ మొగురం రమేశ్ అన్నారు. వడ్కాపూర్‌లోని బౌద్ధస్తూపం వద్ద శుక్రవారం బుద్ధుని జయంతి ఘనంగా నిర్వహించారు. తెలంగాణలోనే ప్రాచీన, ప్రాముఖ్యత, చరిత్ర కలిగిన బౌద్ధ స్తూపం ఉన్న ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. కనీస సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం నిధు లు మంజూరు చేయాలని అన్నారు. జూలపలి మార్కె ట్ కమిటీ చైర్మన్ కొమ్మ పోచాలు, ధూళికట్ట సింగిల్‌విండో మాజీ చైర్మన్ వేణుగోపాలరా వు, సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు నర్సింహ యాదవ్ పాల్గొన్నారు.


