కోల్‌సిటీ: రామగుండం బల్దియా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంక్ సాధించడమే తమ ధ్యేయమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. బల్దియా కార్యాలయం – ఫైవింక్లయిన్ వరకు ప్రధాన రహదారిని స్వీపింగ్ యంత్రంతో శుభ్రపరిచే పనులను మేయర్ సోమవారం పర్యవేక్షించారు. పాత స్వీపింగ్ యంత్రం పనిచేకపోవడంతో ఎమ్మెల్యే సహకారంతో హెచ్‌కేఆర్ నుంచి తెప్పించిన ట్రాక్టర్ స్వీపింగ్ మిషన్‌తో శుభ్రం చేయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పారిశుధ్య సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో పనిచేసే ట్రాక్టర్ మౌంటెడ్ స్వీపింగ్ యంత్రాలు తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లతోపాటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీ రామన్, టీపీఎస్ నవీన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.


