కనీస వేతనాలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

కనీస వేతనాలు అమలు చేయాలి

Mar 31 2026 7:38 AM | Updated on Mar 31 2026 7:38 AM

గోదావరిఖని: అసంఘటిత రంగంలోని కార్మికులకు కనీసవేతనాలు అమలు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ కోరారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, దేశఆర్థిక వ్యవస్థలో అసంఘటిత రంగం కీలక పాత్ర పోషిస్తున్నా.. కార్మికులు ప్రాథమిక హక్కులు, భద్రత, కనీస వేతనాల విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికులు, భవన నిర్మాణ రంగంలోని కార్మికులు, వ్యవసాయ కూలీలు, గృహ సేవకులు, చిన్నపరిశ్రమల కార్మికులు దేశ అభివృద్ధికి పునాది లాంటివారని, వారికి కనీస వేతనాల అమలును కచ్చితంగా నిర్ధారించాలని కోరారు.స్థానిక అధికారులు, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేసి ఈసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement