జ్యోతినగర్: తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమైన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలనే డిమాండ్‌తో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమకారులు తోడేటి శంకర్‌గౌడ్, పొన్నం విజయకుమార్‌గౌడ్, వొల్లాల మల్లేశం తదితరులు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ జ్యోతినగర్‌లోని సింధూర కళాశాల రోడ్డులోని వాటర్ ట్యాంకుపైకి ఎక్కి నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 250 చ.గ. నివాసస్థలంతోపాటు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌కిరణ్ వెంటనే అక్కడకు చేరి ఉద్యమకారులతో మాట్లాడారు. కిందికు వచ్చేలా చర్యలు చేపట్టారు. అనంతరం అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో క్రమద్ధీకరీంచారు.


