పెద్దపల్లి: తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆశ వర్కర్లు కోరారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో రాజీవ్ రహదారిపై సోమవారం రాస్తారోకో చేశారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ, తమ హక్కుల సాధన, కనీస వేతనం అమలు, అలవెన్స్‌ల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రతినిధులు అనవేన స్వరూప, మమత, రాజేశ్వరి, ప్రేమలత, మనీద్ర, రజిత, జ్యోతి, స్వరూప, రమాదేవి, అనురాధ, జ్యోత్న, శోభా, స్వప్న తదితరులు పాల్గొన్నారు.


