గోదావరిఖని: ఆర్జీ–1 ఏరియా సీఎస్పీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హెచ్‌ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్‌అహ్మద్ డిమాండ్ చేశారు. సోమవారం ఆర్జీ–1 ఏరియా సీఎస్పీలో జరిగిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడారు. బొగ్గు దుమ్ము లేవకుండా వాటర్ స్ప్రే చేయాలన్నారు. కార్మికులను చార్జిషీట్లు, సస్పెండ్లు చేస్తామని బెదిరింపులు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరెల్లి పోశం, డేగల వరప్రసాద్‌రావు, మురళీధర్, నాగేందర్, మహ్మద్, మల్లేశ్, ప్రసాద్, బట్టు ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


