పత్తి ధర రూ.7,455 | - | Sakshi
Sakshi News home page

పత్తి ధర రూ.7,455

Mar 31 2026 7:38 AM | Updated on Mar 31 2026 7:38 AM

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,455 ధర పలికిందని మార్కెట్‌కమిటీ చైర్మన్‌ కూరమల్లారెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. కనిష్టంగా రూ.5,526గా, సగటు రూ.7,055గా ధర ఉందని వారు పేర్కొన్నారు.

మెడికల్‌బోర్డు పునరుద్ధరించాలి

గోదావరిఖని: సింగరేణిలో మెడికల్‌ బోర్డు పునరుద్ధరించాలని టీబీజీకేఎస్‌ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం ఆర్జీ–2 జీఎం ఆఫీస్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్మికుల పెండింగ్‌ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. సుమారు గంటపాటు నిరసన తెలిపి అనంతరం పర్సనల్‌ డీజీఎం అరవిందరావుకు వినతిపత్రం అందజేశారు. నాయకులు డి.సురేందర్‌, మామిడి తిరుపతి, కూర తిరుపతి, రవితేజ, హరిప్రసాద్‌, బొడ్డు రమేశ్‌, దాసరి శ్రీనివాస్‌, శశాంక్‌ తదితరులు పాల్గొన్నారు.

వాకింగ్‌ చేస్తుండగా చైన్‌స్నాచింగ్‌

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి శివారు బందంపల్లిలో సోమవారం రాత్రి ఇంటిముందు వాకింగ్‌ చేస్తున్న గుండు లక్ష్మీనర్సమ్మ అనే వృద్ధురాలి మెడలో నుంచి దొంగలు బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. స్థానికుల కథనం ప్రకారం.. రాత్రి భోజనం చేసిన ఇంటిముందు కాలినడకన తిరుగుతుండడాన్ని గమనించిన యువకులు.. బైక్‌పై వచ్చి మూడుతులాల బంగారు గొలుసు తెంపుకుని వచ్చిన దారినే వెళ్లి పోయారని బాధితురాలు తెలిపింది. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

పెద్దపల్లిరూరల్‌: పట్టణంలోని రాంపల్లి డబుల్‌ బెడ్‌డ్రూమ్‌ కాలనీలో వీధిదీపాలను ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరారు. ఈ మేరకు డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై మల్లేశ్‌కు వినతిపత్రం అందించారు. అందుకు సానుకూలంగా అధికారులు స్పందించారని వారు పేర్కొన్నారు.

హత్యాయత్నం కేసులో నిందితుని అరెస్ట్‌

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలో శనివారం రాత్రి బాలాజీనగర్‌కు చెందిన తుమ్మల లోకేశ్‌పై హత్యాయత్నానికి పాల్పడిన ఓరుగంటి వివేక్‌ను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్‌ తెలిపారు. తహసీల్‌ చౌరస్తా వద్దనున్న అమృత విల్లాస్‌ హోటల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్న లోకేశ్‌, అదే హోటల్‌లో మేనేజర్‌ వివేక్‌ మధ్య గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో లోకేశ్‌ను చంపాలనే ఉద్దేశంతో తన వద్దనున్న సర్జికల్‌ బ్లేడ్‌తో వీపుపై పొడవగా బలమైన రక్తగాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement